Asianet News TeluguAsianet News Telugu

పోలీసులపై దాడి: వైఎస్ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల అరెస్ట్

వైఎస్ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ను  జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్  చేశారు.  పోలీసులపై దాడి కేసులో  అరెస్ట్  చేసినట్టుగా  పోలీసులు ప్రకటించారు.  షర్మిలపై  ఎస్ఐ రవీంద్ర ఇచ్చిన  ఫిర్యాదు మేరకు  పోలీసులు కేసు నమోదు  చేశారు.  

Hyderabad  Police Arreste d  YSRTP Chief  YS Sharmila lns
Author
First Published Apr 24, 2023, 3:07 PM IST

హైదరాబాద్: వైఎస్ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిలను  సోమవారంనాడు  పోలీసులు అరెస్ట్  చేశారు.  ఎస్ఐ రవీంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమెపై  కేసు నమోదు  చేశారు.  ఈ కేసు ఆధారంగా  షర్మిలను  అరెస్ట్  చేశారు. షర్మిల కారుతో ఢీకొనడంతో  కానిస్టేబుల్ కు గాయాలయ్యాయని  పోలీసులు చెబుతున్నారు.  పోలీసులపై దాడి  చేసి కారుతో  ఢీకొట్టిన  కేసులో  వైఎస్ షర్మిలను  పోలీసులు అరెస్ట్  చేశారు. 

ఎస్ఐ రవీంద్ర ఇచ్చిన  ఫిర్యాదు మేరకు  వైఎస్ షర్మిలపై  నాలుగు సెక్షన్ల కింద  కేసు నమోదు  చేశారు.  ఐపీసీ  332,353,509,427 సెక్షన్ల కింద వైఎస్ షర్మిలపై  పోలీసులు కేసు నమోదు  చేశారు.  వైఎస్ షర్మిలపై  బంజారాహిల్స్  పోలీసులు  కేసు నమోదు  చేశారు. ముందు జాగ్రత్తగా ఆమెను జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.  జూబ్లీహిల్స్  పోలీస్ స్టేషన్ నుండి  వైఎస్ షర్మిల ను  కోర్టుకు  తరలించనున్నారు.   కోర్టుకు  తరలించడానికి  ముందు  వైఎస్ షర్మిలను ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు  నిర్వహించనున్నారు

also read:రక్షణ కోసం సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవడం నా బాధ్యత: వైఎస్ షర్మిల

టీఎస్‌పీఎస్‌సీ  పేపర్ లీక్  కేసులో సిట్ కార్యాలయానికి  ఇవాళ  వైఎస్ షర్మిల  వెళ్లడానికి  ప్రయత్నించారు.  అయితే  వైఎస్ షర్మిలను  పోలీసులు అడ్డుకున్నారు.   వైఎస్ షర్మిల సిట్ కార్యాలయానికి వెళ్లేందుకు  ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులతో  వాగ్వాదానికి దిగారు.   పోలీసులను నెట్టివేశారు. తమపై  వైఎస్ షర్మిల  చేయిచేసుకున్నారని  పోలీసులు చెబుతున్నారు.  పోలీసులు అడ్డుకోవడంతో  అక్కడే బైఠాయించి  వైఎస్ షర్మిల నిరసనకు దిగారు.  పోలీసులపై   దురుసుగా వ్యశహరించడంతో  వైఎస్ షర్మిల ను  పోలీసులు  పోలీస్ స్టేషన్ కు తరలించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios