Asianet News TeluguAsianet News Telugu

బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసు: మరో 15 మంది అరెస్ట్, మరో 9 మంది కోసం గాలింపు

బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో మరో 15 మందిని హైద్రాబాద్ పోలీసులు ఆదివారం నాడు అరెస్ట్ చేశారు.  దీంతో ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టైన వారి సంఖ్య 19 మందికి చేరుకొంది. 

hyderabad police 15 arrested in bowenpally kidnap case
Author
Hyderabad, First Published Jan 17, 2021, 1:54 PM IST


హైదరాబాద్: బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో మరో 15 మందిని హైద్రాబాద్ పోలీసులు ఆదివారం నాడు అరెస్ట్ చేశారు.  దీంతో ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టైన వారి సంఖ్య 19 మందికి చేరుకొంది. 

ఈ నెల 5వ తేదీన బోయిన్‌పల్లి ప్రవీణ్ రావుతో పాటు ఆయన ఇద్దరు సోదరులను  కిడ్నాప్ చేశారు. హాఫీజ్‌పేట భూ వివాదానికి సంబంధించి ఏపీకి చెందిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ దంపతులు కిడ్నాప్ చేయించారని పోలీసులు తెలిపారు.

ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రి భూమా అఖిలప్రియతో పాటు  మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవాళ మరో 15 మందిని అరెస్ట్ చేశారు. 

also read:బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసు: భూమా అఖిలప్రియ ఫోన్ల స్వాధీనానికి పోలీసుల ప్రయత్నం

ఈ కేసులో ఇంకా 9 మందిని అరెస్ట్ చేయాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి కీలక సమాచారాన్ని రాబట్టేందుకు గాను పోలీసులు మూడు రోజుల పాటు అఖిలప్రియను తమ కస్టడీలోకి తీసుకొన్నారు. అఖిలప్రియ కస్టడీ ఈ నెల 15వ తేదీతో పూర్తైంది. దీంతో ఆమెను కోర్టులో హాజరుపరిస్తే జ్యూడీషీయల్ రిమాండ్ తరలించింది కోర్టు.

అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్, సోదరుడు చంద్రహాస్ అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి , మాడాల శ్రీను కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు., భార్గవ్ రామ్ తల్లిదండ్రుల కోసం  పోలీసులు గాలిస్తున్నారు. భార్గవ్ రామ్ కుటుంబానికి ఈ కేసుతో సంబంధం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios