హైదరాబాద్‌లో లాక్‌డౌన్‌ను పట్టించుకోని జనం: కూకట్‌పల్లిలో భారీగా ట్రాఫిక్ జాం

కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రజలు గడప దాటి బయటకు రావొద్దని ప్రధాని నరేంద్రమోడీ, ముఖ్యమంత్రులు, ప్రముఖులు విజ్ఞప్తి చేస్తున్నారు. అయినప్పటికీ కొందరు మాత్రం బాధ్యత లేకుండా రోడ్ల మీదకు వస్తున్నారు.

hyderabad people ignoring lock down rules heavy traffic jam in kukatpally

కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రజలు గడప దాటి బయటకు రావొద్దని ప్రధాని నరేంద్రమోడీ, ముఖ్యమంత్రులు, ప్రముఖులు విజ్ఞప్తి చేస్తున్నారు.

అయినప్పటికీ కొందరు మాత్రం బాధ్యత లేకుండా రోడ్ల మీదకు వస్తున్నారు. తొలి రెండు రోజులు సహనంతో వ్యవహరించిన పోలీసులు ఆ తర్వాతి నుంచి లాఠీలకు పనిచెప్పారు. దీనిపై దేశవ్యాప్తం పోలీసులపై విమర్శలు వెల్లువెత్తాయి.

Also Read:తెలంగాణలో కొత్తగా 14 కేసులు, ఇద్దరు మృతి: 872కి చేరిన బాధితుల సంఖ్య

కాగా తెలంగాణలోనూ పోలీసులు లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. అయినప్పటికీ కొన్ని చోట్ల ప్రజలు లాక్‌డౌన్‌ను బేఖాతరు చేస్తున్నారు. సాధారణ రోజుల్లో లాగానే వాహనాలతో జనం బయటకు వస్తున్నారు.

ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో భారీ సంఖ్యలో జనం బయటకు వచ్చారు. దీంతో పోలీసులు ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తూ ఉండటంతో వై జంక్షన్ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.

Also Read:పోలీసులపై ప్రేమ చూపిన పెద్దావిడ... ఫిదా అయిన పోలీస్ బాస్

కిలోమీటర్లకు పైగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇదే సమయంలో సరైన కారణం లేకుండా బయటకు వచ్చే వాహనాలను పోలీసులు సీజ్ చేస్తున్నారు. కాగా తెలంగాణలో సోమవారం కొత్తగా మరో 14 కేసులు నమోదయ్యాయి.

దీంతో మొత్తం కేసుల సంఖ్య 872కి చేరింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్  పరిధిలోనే 12 కేసులు నమోదవ్వగా.. మేడ్చల్, నిజామాబాద్ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios