వినాయకచవితి అంటే హిందువుల పండగ. కానీ.. ఓ ముస్లిం వ్యక్తి మాత్రం మతాలకు అతీతంగా గణేశ్ ఉత్సవాల్లో పాల్గొన్నాడు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది.

నగరానికి చెందిన షరీఫ్ అబ్దుల్లా బిన్ మాజీ ఎంపీటీసీ సభ్యుడు. బుధవారం గణేశ్ ఉత్సవాల్లో పాల్గొన్నాడు. స్వామి ప్రసాదాన్ని భక్తులందరికీ పంపిణీ చేసేందుకు ఆయన ప్రత్యేకంగా లడ్డు ప్రసాదాలను కూడా కొనుగోలు చేశాడు. దాదాపు రూ.25వేల రూపాయల విలువగల లడ్డు ప్రసాదాన్ని కొనుగోలు చేసి భక్తులకు పంపిణీ చేశాడు.