హైదరాబాద్ ఎస్‌ఆర్ నగర్‌లో ఇద్దరు వ్యక్తులు రెచ్చిపోయారు. ఎర్రగడ్డ మానసిక వైద్య శాఖ ఆవరణలో ఓ యువకుడిపై హత్యాయత్నానికి పాల్పడ్డారు.
హైదరాబాద్ ఎస్‌ఆర్ నగర్‌లో ఇద్దరు వ్యక్తులు రెచ్చిపోయారు. ఎర్రగడ్డ మానసిక వైద్య శాఖ ఆవరణలో ఓ యువకుడిపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. వివరాలు.. ఎర్రగడ్డ ఆస్పత్రి ఆవరణలో ఆదిల్ అనే యువకుడిపై మహ్మద్, అజార్ అనే ఇద్దరు పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ దాడిలో అదిల్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స కోసం ఆదిల్‌ను ఉస్మానియా ఆస్పత్రికి తరలింపు ఆదిల్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా వైద్యులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
హత్యాయత్నానికి పాల్పడిన ఇద్దరు గతంలో నేర చరిత్ర ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. బాధితుడు ఆదిల్‌పైన గతంలో దొంగతనం కేసు ఉంది. ఆదిల్‌పై హత్యాయత్నానికి పాల్పడిన నిందితులు అతని స్నేహితులేనని తెలుస్తోంది. పాతకక్షలను మనసులో పెట్టుకుని ఈ పని చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
