ఉగ్ర మూకలతో జతకట్టిన వాళ్లు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. మరోవైపు న్యూక్లియర్ శక్తి ఉందంటూ పాక్ చంకలు గుద్దుకుంటోందని విమర్శించారు. బాంబులు మా వద్ద కూడా ఉన్నాయన్నారు. మేం మీకంటే సమర్థంగా వాటిని ప్రయోగించగలం అంటూ అసదుద్దీన్ ఓవైసీ పాకిస్థాన్ కు హెచ్చరించారు.
హైదరాబాద్: పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు గట్టి వార్నింగ్ ఇచ్చారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. ఇమ్రాన్ ఖాన్ తనను తాను టిప్పు సుల్తాన్‌గా అభివర్ణించుకోవడంపై మండి పడ్డారు. హైదరాబాద్ దారుసలేంలో ఎంఐఎం 61వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన తాము ఉగ్రవాదాన్ని సహించమని స్పష్టం చేశారు.
అసలు ఆ పద్ధతికి తామెప్పుడూ వ్యతిరేకమని చెప్పుకొచ్చారు. పాక్ ప్రధాని తనను తాను టిప్పు సుల్తాన్‌గా అభివర్ణించుకోవడం హాస్యాస్పదంగా ఉందంటూ విరుచుకుపడ్డారు. సుల్తాన్ ఎప్పుడూ హిందువులకు వ్యతిరేకంగా లేరన్న ఆయన రాజ్యానికి ఉన్న శత్రువుల మీద మాత్రమే టిప్పు సుల్తాన్ పోరాడారని చెప్పుకొచ్చారు.
ఉగ్ర మూకలతో జతకట్టిన వాళ్లు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. మరోవైపు న్యూక్లియర్ శక్తి ఉందంటూ పాక్ చంకలు గుద్దుకుంటోందని విమర్శించారు. బాంబులు మా వద్ద కూడా ఉన్నాయన్నారు. మేం మీకంటే సమర్థంగా వాటిని ప్రయోగించగలం అంటూ అసదుద్దీన్ ఓవైసీ పాకిస్థాన్ కు హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి