Asianet News TeluguAsianet News Telugu

విద్వేషపూరిత ప్రసంగాలతో బీజేపీలో ఫాస్ట్ ప్రమోషన్‌.. కాషాయ పార్టీపై అస‌దుద్దీన్ ఒవైసీ ఫైర్

Telangana Assembly Elections 2023: గోషామ‌హ‌ల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సస్పెన్షన్ ను బీజేపీ ఎత్తివేసింది. ఈ క్ర‌మంలోనే స్పందించిన హైద‌రాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అస‌దుద్దీన్ ఒవైసీ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ద్వేషపూరిత ప్రసంగాలు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ నాయ‌క‌త్వంలోని బీజేపీలో ప్రమోషన్‌కు అత్యంత వేగవంతమైన మార్గమంటూ విమ‌ర్శ‌ల దాడి చేశారు. 
 

Hyderabad MP Asaduddin Owaisi slams BJP for lifting Raja Singh's suspension RMA
Author
First Published Oct 23, 2023, 11:14 AM IST

Hyderabad MP Asaduddin Owaisi: గోషామ‌హ‌ల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సస్పెన్షన్ ను బీజేపీ ఎత్తివేసింది. ఈ క్ర‌మంలోనే స్పందించిన హైద‌రాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అస‌దుద్దీన్ ఒవైసీ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ద్వేషపూరిత ప్రసంగాలు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ నాయ‌క‌త్వంలోని బీజేపీలో ప్రమోషన్‌కు అత్యంత వేగవంతమైన మార్గమంటూ విమ‌ర్శ‌ల దాడి చేశారు. 

వివ‌రాల్లోకెళ్తే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాష్ట్ర రాజకీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. వివిధ పార్టీలు నాయ‌కులు ఒక‌రిపై ఒక‌రు తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే ఎఐఎంఐఎం అధినేత‌, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ బీజేపీని టార్గెట్ చేస్తూ విమ‌ర్శ‌లు గుప్పించారు. వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన బీజేపీ గోషామ‌హ‌ల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై ఆ పార్టీ సస్పెన్షన్‌ను ఎత్తివేసింది.   

ప్రవక్తపై దైవదూషణ వ్యాఖ్యలు చేసి అరెస్టయి సస్పెన్షన్‌కు గురైన గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్‌పై సస్పెన్షన్‌ను ఉపసంహరించుకున్నందుకు కాషాయ పార్టీపై మండిప‌డిన ఒవైసీ, నూపుర్ శర్మకు ప్రధాని నరేంద్ర మోడీ నుండి ఆశీర్వాదం లభిస్తుందని తాను ఖచ్చితంగా అనుకుంటున్నానని విమ‌ర్శించారు. బీజేపీ నేతలు నుపుర్ శర్మ, ఎమ్మెల్యే రాజా సింగ్‌లు ఈ ఏడాది ప్రారంభంలో దైవదూషణ చేసి వివాదం రేపారు. వీరి వ్యాఖ్య‌లు జాతీయంగానే కాంకుండా ఒక వ‌ర్గం నుంచి అంత‌ర్జాతీయంగా ఆగ్ర‌హాన్ని రేపాయి. ఈ క్ర‌మంలోనే వారిని బీజేపీ సస్పెండ్ చేసింది. అయితే, ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాజాసింగ్ పై సస్పెన్షన్‌ను బీజేపీ ఎత్తివేసింది. ఎక్స్ లో అసదుద్దీన్ ఒవైసీ చేసిన పోస్టులో.. "ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ త‌న ప్రియమైన “ఫ్రింజ్ ఎలిమెంట్‌కి రివార్డ్ ఇచ్చారు. నూపుర్ శర్మ కూడా ప్రధానమంత్రి నుండి ఆమె ఆశీస్సులు పొందుతారని ఖచ్చితంగా చెప్పవచ్చు. ద్వేషపూరిత ప్రసంగం మోడీ బీజేపీలో ప్రమోషన్‌కు అత్యంత వేగవంతమైన మార్గం" అంటూ విమ‌ర్శించారు.

కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితాను ఆదివారం ప్రకటించడానికి కొద్దిసేపటి ముందు, గోషామహల్ ఎమ్మెల్యేపై సస్పెన్షన్‌ను ఉపసంహరించుకున్న బీజేపీ, అదే నియోజకవర్గం నుంచి ఆయనను బరిలోకి దింపింది. ఇదిలావుండగా, పార్టీ సీనియర్ నేతలతో అనుచితంగా ప్రవర్తించినందునే రాజాసింగ్‌ను బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసిందని మజ్లిస్ బచావో తెహ్రీక్ (ఎంబీటీ) అధికార ప్రతినిధి అంజేదుల్లా ఖాన్ తెలిపారు. "వీరంతా దీనిపై నాయకత్వానికి ఫిర్యాదు చేసి అవకాశం కోసం ఎదురుచూశారు. అతను మహ్మద్ ప్రవక్తపై దైవదూషణ వ్యాఖ్యలు చేసినప్పుడు, వారు దానిని సాకుగా తీసుకొని అతనిని సస్పెండ్ చేశారని" పేర్కొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios