వేతనాల పెంపు, పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని మధ్యాహ్న భోజన కార్మికుల నిరసన
Hyderabad: పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ మధ్యాహ్న భోజన కార్మికులు నిరసన చేపట్టారు. హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు సమీపంలోని ధర్నా చౌక్‌లో పెద్ద సంఖ్యలో చేరుకున్న మధ్యాహ్న భోజన కార్మికులు తమ హక్కుల కోసం నినాదాలు చేశారు.
Mid-day meal workers protest: పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ మధ్యాహ్న భోజన కార్మికులు నిరసన చేపట్టారు. హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు సమీపంలోని ధర్నా చౌక్‌లో పెద్ద సంఖ్యలో చేరుకున్న మధ్యాహ్న భోజన కార్మికులు తమ హక్కుల కోసం నినాదాలు చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు.
వివరాల్లోకెళ్తే.. పెండింగ్ బిల్లులు కేటాయించాలనీ, వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ మరోసారి పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చింది. హైదరాబాద్ లోని ఇందిరాపార్కు సమీపంలోని ధర్నా చౌక్ వద్ద బుధవారం కార్మికులు గుమిగూడి తమ హక్కుల కోసం నినాదాలు చేశారు. సీఐటీయూకు అనుబంధంగా ఉన్న మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న కార్మికులు ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం తమకు గతంలో హామీ ఇచ్చిన దీర్ఘకాలిక బిల్లులు, గౌరవ వేతనాలను క్లియర్ చేయాలని డిమాండ్ చేశారు.
మధ్యాహ్న భోజన పథకం కార్మికులు తమ హక్కుల కోసం ఆందోళన చేయడం ఇదే మొదటిసారి కాదు. తమ వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ జూలైలో 1000 మందికి పైగా కార్మికులు 'చలో హైదరాబాద్' ఉద్యమంలో పాల్గొన్నారు. 'చలో హైదరాబాద్' నిరసనలో కార్మికులు తమ సమస్యలపై ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించారు.