Asianet News TeluguAsianet News Telugu

రెండో రోజు కొనసాగుతున్న ఆందోళన.. టికెటింగ్ సిబ్బందితో మెట్రో అధికారులు చర్చలు..

వేతనాలు పెంచాలని డిమాండ్  చేస్తూ హైదరాబాద్ మెట్రోలో టికెటింగ్ విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్టు సిబ్బంది చేపట్టిన ధర్నా రెండో రోజు కొనసాగుతుంది. రెడ్‌లైన్ (మియాపూర్-ఎల్‌బీ నగర్) మెట్రో స్టేషన్లలో పనిచేస్తున్న 150 మంది ఉద్యోగులు విధులకు దూరంగా ఉన్నారు.

Hyderabad metro Ticketing staff continue strike on second day
Author
First Published Jan 4, 2023, 1:24 PM IST

వేతనాలు పెంచాలని డిమాండ్  చేస్తూ హైదరాబాద్ మెట్రోలో టికెటింగ్ విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్టు సిబ్బంది చేపట్టిన ధర్నా రెండో రోజు కొనసాగుతుంది. రెడ్‌లైన్ (మియాపూర్-ఎల్‌బీ నగర్) మెట్రో స్టేషన్లలో పనిచేస్తున్న 150 మంది ఉద్యోగులు విధులకు దూరంగా ఉన్నారు. ఉప్పల్ మెట్రో కంట్రోల్ రూమ్ దగ్గర టికెటింగ్ సిబ్బంది ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే మెట్రో అధికారులు మరోసారి టికెటింగ్ సిబ్బందితో చర్చలు జరుపుతున్నారు. మరోవైపు అమీర్‌పేట మెట్రో స్టేషన్‌లో రోజవారి కార్యకలాపాలు సాధారణంగానే సాగుతున్నాయి. టికెట్ల జారీ యథావిథిగా కొనసాగుతుంది. 

ఇదిలా ఉంటే.. గత ఐదేళ్లుగా తమ జీతాలు పెంచడం లేదని ఆరోపిస్తూ మెట్రోలో టికెటింగ్ విభాగంలో పనిచేస్తున్న సిబ్బంది మంగళవారం ఆందోళనకు దిగారు. మ జీతం రూ. 11 వేల నుంచి కనీసం రూ. 18 వేలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఐదేళ్లుగా తమ జీతాలు పెంచడం లేదని వారు చెబుతున్నారు. తాము ఐదేళ్ల క్రితం రూ. 11 వేల జీతంతో ఇక్కడ చేరామని.. ఇప్పటి వరకు అదే వేతనాలకు పని చేస్తున్నామని చెప్పారు. తాము మనుషులం కాదా?.. న్యాయమైన పరిహారం పొందేందుకు అర్హత లేదా అని వారు ప్రశ్నిస్తున్నారు. జీతాలు పెంచాలని తమ కాంట్రాక్టర్‌కు పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ ఎలాంటి లాభం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తరుచూ కాంట్రాక్టర్లు మారుతునే ఉన్నారని.. జీతాలు పెంచమని అభ్యర్థిస్తున్న ప్రతిసారీ వారి నుంచి కొత్తగా  వచ్చామనే సమాధానం  వస్తుందన్నారు. 

జీతాలు పెంచడంతో పాటు.. రాత్రిపూట షిఫ్టుల్లో పనిచేసే ఉద్యోగులకు మెట్రో ద్వారా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రెగ్యులర్ వీక్లీ ఆఫ్‌లు కాకుండా.. ఏడాదికి కనీసం 20 సెలవులను కేటాయించాలని కోరుతున్నారు.

ఇదిలా ఉంటే.. మెట్రో టికెటింగ్ సిబ్బంది ఆందోళనతో.. టిక్కెట్ల జారీకి సమయం పట్టడంతో మెట్రో రైలు సర్వీసులు కొద్దిసేపు ప్రభావితమయ్యాయి.
మెట్రో టికెటింగ్‌ సిబ్బందితో కియోలిస్ ఏజెన్సీ ప్రతినిధులు చర్చలు జరిపారు. అమీర్ పేట మెట్రో స్టేషన్‌లో ఐదుగురు టికెటింగ్ సిబ్బందితో చర్చలు నిర్వహించారు. వేతనాల పెంపుపై ఉన్నతాధికారులతో చర్చించి చెబుతామని వారు తెలిపారు. దీంతో ధర్నాను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు ప్రకటించారు. అయితే స్పష్టమైన హామీ వచ్చేవరకు విధులకు హాజరుకామని చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios