అన్‌లాక్ 4లో భాగంగా మెట్రో రైళ్ల ప్రయాణాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా హైదరాబాద్ మెట్రో సైతం పట్టాలెక్కేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన గైడ్‌లైన్స్‌ను హైదరాబాద్ మెట్రో కార్పోరేషన్ గురువారం విడుదల చేసింది. 

హైదరాబాద్ మెట్రో మార్గదర్శకాలు:

* మెట్రో రైళ్లలో ప్రయాణీకులు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి
* మాస్క్ ధరించని ప్రయాణికులకు జరిమానా 
* స్టేషన్‌, ఫ్లాట్‌ఫామ్, మెట్రో రైళ్లో ప్రయాణీకులు భౌతిక దూరం పాటించాలి
* సీసీ కెమెరాల ద్వారా ప్రయాణీకులపై నిఘా
* ప్రయాణీకుల రద్దీని బట్టి ఫ్రీక్వెన్సీపై నిర్ణయం 
* స్మార్ట్‌కార్డ్, క్యాష్ లెస్ విధానంలో టిక్కెట్లు జారీ
* మెట్రో సిబ్బందికి పీపీఈ కిట్లు 
* లిఫ్టులను తాత్కాలికంగా నిలిపివేత
* లక్షణాలు లేని వారిని మాత్రమే మెట్రో ప్రయాణానికి అనుమతి