Asianet News TeluguAsianet News Telugu

మెట్రో రైలు సర్వీసు పునరుద్ధరణ

మధ్యాహ్నం సమయానికి సమస్యను గుర్తించిన అధికారులు సర్వీసులను పునరుద్ధరించారు. విద్యుత్‌ తీగల మరమ్మతు వల్ల రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని ఎన్‌వీఎస్ ‌రెడ్డి తెలిపారు. 

hyderabad metro md NVSredday says  problem solved in metro
Author
Hyderabad, First Published Oct 13, 2018, 2:51 PM IST

సాంకేతిక లోపంతో నిలిచిపోయిన మెట్రో రైలు సర్వీసులను పునరుద్ధరించినట్లు మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. శనివారం ఉదయం మియాపూర్ నుంచి అమీర్ పేట వెళ్తున్న రైలు.. బాలానగర్ లో ఆగిపోయిన సంగతి తెలిసిందే. కరెంట్ లేకపోవడం వల్ల మెట్రో ఆగిపోయినట్లు సిబ్బంది తెలిపారు. ఈ ఒక్క రైలు ఆగడం వల్ల ఇతర సర్వీసుల రాకపోకలకు కూడా ఇబ్బంది ఏర్పడింది.

సమాచారం తెలుసుకున్న వెంటనే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మరమ్మతులు చేపట్టారు.అయితే, మధ్యాహ్నం సమయానికి సమస్యను గుర్తించిన అధికారులు సర్వీసులను పునరుద్ధరించారు. విద్యుత్‌ తీగల మరమ్మతు వల్ల రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని ఎన్‌వీఎస్ ‌రెడ్డి తెలిపారు. రెండు ట్రాక్‌ల్లో రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.

Follow Us:
Download App:
  • android
  • ios