మెట్రోపై వస్తున్న వదంతులు నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. మెట్రో పిల్లర్లు, స్ట్రక్చర్‌కు ఎటువంటి ప్రమాదం లేదని ఆయన స్పష్టం చేశారు.

మెట్రో నిర్మాణమంతా సురక్షితంగా ఉందని రెడ్డి వెల్లడించారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, అలాగే మెట్రోపై వదంతులు సృష్టించవద్దని ఆయన సూచించారు.

ప్రయాణీకులకు ఎలాంటి ఇబ్బంది లేదని ఎన్వీఎస్ రెడ్డి స్పష్టం చేశారు. వర్షం తగ్గిన వెంటనే రోడ్డు మరమ్మత్తు పనులు చేపడతామని ఆయన ప్రకటించారు.

Also Read:ప్రమాదంలో హైదరాబాద్ మెట్రో: స్టేషన్ కింద పిల్లర్ వద్ద కుంగిన భూమి

కాగా, మూసాపేట్ మెట్రోస్టేషన్ వద్ద భారీగా రోడ్డు కుంగింది. వరద తాకిడికి మెట్రో పిల్లర్ చుట్టూ నిర్మించిన సర్ఫెజ్ వాల్ ధ్వంసమైంది. దీంతో రెండు మెట్రో పిల్లర్ల చుట్టూ రోడ్డు కొట్టుకుపోయింది.

ఇలాంటి ప్రమాదంలోనే మెట్రో రైళ్లు మియాపూర్ వైపు తిరుగుతున్నాయి. ప్రయాణికులు, స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఇంకోవైపు మూసాపేట్‌ వద్ద వాహన రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది.