మెట్రో రైళ్లలో స్టూడెంట్ పాస్‌ను ప్రవేశపెడుతున్నట్లు హైదరాబాద్ మెట్రో తెలిపింది. ఏప్రిల్ 1 1998 తర్వాత జన్మించిన విద్యార్ధులకు ఈ అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పింది.
విద్యార్ధులకు హైదరాబాద్ మెట్రో రైల్ శుభవార్త చెప్పింది. మెట్రో రైళ్లలో స్టూడెంట్ పాస్‌ను ప్రవేశపెడుతున్నట్లు తెలిపింది. విద్యార్ధులు 20 ట్రిప్పులకు డబ్బులు చెల్లించి 30 ట్రిపుల్లో ప్రయాణించవచ్చని పేర్కొంది. 2024 మార్చి 31 వరకు విద్యార్ధులకు పాస్ సదుపాయం వుంటుందని తెలిపింది. ఏప్రిల్ 1 1998 తర్వాత జన్మించిన విద్యార్ధులకు ఈ అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పింది. ఇవాళ్టీ నుంచే పథకం స్టూడెంట్ పాస్ అందుబాటులో వుంటుందని మెట్రో అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
Add Asianetnews Telugu as a Preferred Source

