Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్ మెట్రో మరో రికార్డ్

హైదరాబాద్ మెట్రో మరో రికార్డ్ ని సొంతం చేసుకుంది. మెట్రోలో ప్రయాణించేవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది.

Hyderabad Metro crosses 30 million mark
Author
Hyderabad, First Published Nov 16, 2018, 9:54 AM IST

హైదరాబాద్ మెట్రో మరో రికార్డ్ ని సొంతం చేసుకుంది. మెట్రోలో ప్రయాణించేవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. నవంబర్ 14 నాటికి మెట్రోలో మూడుకోట్ల మంది ప్రజలు ప్రయాణించారు. 

నగరంలో మెట్రోరైళ్లు ప్రారంభమైన 351 రోజుల్లోనే రికార్డుస్థాయిలో ప్రయాణికులు మెట్రోరైళ్లలో ప్రయాణించడం తమకు గర్వకారణంగా ఉందని ఎల్‌ అండ్‌ టీ ఎంఆర్‌హెచ్‌ఎల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కేవీబీ రెడ్డి అన్నారు. 

రెండు కోట్ల నుంచి మూడు కోట్లమంది ప్రయాణికుల మార్కును చేరుకునేందుకు కేవలం 71 రోజుల సమయం మాత్రమే పట్టిందని చెప్పారు. రోజువారీగా నగరంలో మెట్రో రైళ్లు 550 ట్రిప్పులు, 13 వేల కిలోమీటర్ల మేర ఎల్బీనగర్‌– మియాపూర్, నాగోల్‌–అమీర్‌పేట్‌ మార్గాల్లో రాకపోకలు సాగిస్తున్నాయని పేర్కొన్నారు. 

మెట్రోరైళ్లలో రద్దీ అనూహ్యంగా పెరుగుతున్నప్పటికీ ఎవరికీ అసౌకర్యం కలగకుండా నిర్వహణ సంస్థ కియోలిస్‌ టీం అద్భుతంగా పనిచేస్తోందన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios