హైదరాబాద్: తెలంగాణలోని వికారాబాద్ జిల్లా పరిగిలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఇద్దరు వ్యక్తులు 16 ఏళ్ల విద్యార్థినిపై దారుణానికి ఒడిగట్టారు. లిఫ్ట్ ఇచ్చి అమ్మాయిపై పలుమార్లు అత్యాచారం చేశారు ఈ సంఘటన సోమవారంనాడు చోటు చేసుకుంది. 

వికారాబాద్ జిల్లా పూడూరు గ్రామానికి చెందిన బాధితురాలు పరిగిలోని కాలేజీలో వొకేషనల్ కోర్సు చేస్తోంది. సోమవారం ఉదయం పరిగికి బస్సులో వెళ్లింది. కాలేజీ వైపు నడుస్తుండగా ఒకతను ఎదురై కాలేజీ వద్ద దింపుతామని చెప్పారు.

దాంతో ఆమె బైక్ ఎక్కింది. ఆమె పరిగి శివారులోని నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకుని వెళ్లారు. తొలుత ఒకతను ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత పరిగికి 20 కిలోమీటర్ల దూరంలోని నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకుని వెళ్లాడు. అక్కడ ఆమపై రెండో వ్యక్తి అత్యాచారం చేశాడు. 

ఆ తర్వాత అమ్మాయిని పరిగిలో వదిలేసి వెళ్లిపోయారు. అమ్మాయి పోలీసు స్టేషన్ కు వెళ్లి జరిగిన సంఘటనపై ఫిర్యాదు చేసింది. ఇద్దరు వ్యక్తులతో అమ్మాయికి ఏ విధమైన పరిచయం లేదని తెలుస్తోంది.