తాను ఆశించిన టికెట్ దక్కకపోవడంతో తీవ్ర నిరాశకు గురై.. ఆ సమావేశానికి ఆయన హాజరు కాలేదు. తన స్థానంలో సమావేశానికి వెళ్లి చైర్మన్‌గా వ్యవహరించాలని మీర్‌పేట హెచ్‌బీకాలనీ కార్పొరేటర్‌, స్టాండింగ్‌ కమిటీ సభ్యుడు అంజయ్యకు ఫోన్‌ చేసి చెప్పినట్టు సమాచారం. 

కేసీఆర్ పై హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ అలకబూనారు. తెలంగాణ లో ముందస్తు ఎన్నికల్లో భాగంగా తెలంగాణ అసెంబ్లీని కేసీఆర్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి.. త్వరలో రానున్న ఎన్నికల్లో తన పార్టీ నుంచి ఎవరు పోటీ చేయనున్నారో వారి పేర్లను కూడా ప్రకటించారు. 

అయితే... ఉప్పల్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్‌ ఆశించిన రామ్మోహన్‌... అక్కడి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా భేతి సుభాష్ రెడ్డి ఖరారు చేయడంతో తీవ్ర నిరాశకు గురయ్యారని ఆయన అనుచరులు చెబుతున్నారు. నిజానికి గురువారం జీహెచ్‌ఎంసీ స్టాండింగ్‌ కమిటీ సమావేశం జరిగింది. దీనికి కచ్చితంగా రామ్మోహన్ హాజరు అవ్వాల్సి ఉంది. 

తాను ఆశించిన టికెట్ దక్కకపోవడంతో తీవ్ర నిరాశకు గురై.. ఆ సమావేశానికి ఆయన హాజరు కాలేదు. తన స్థానంలో సమావేశానికి వెళ్లి చైర్మన్‌గా వ్యవహరించాలని మీర్‌పేట హెచ్‌బీకాలనీ కార్పొరేటర్‌, స్టాండింగ్‌ కమిటీ సభ్యుడు అంజయ్యకు ఫోన్‌ చేసి చెప్పినట్టు సమాచారం. 

సాయంత్రం నుంచి మొబైల్‌ స్విచ్చాఫ్‌ చేసిన మేయర్‌ పార్టీ వర్గాలకూ అందుబాటులోకి రాలేదని సమాచారం. కాగా, ఇదే తుది జాబితా కాదని, కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల పేర్లు మారే అవకాశముందని మేయర్‌ అనుచరులు చెబుతుండడం గమనార్హం.