ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం తన బంధువుని ఇంటికి పిలిచి అతను అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ సంఘటన దుండిగల్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... దుండిగల్ కి చెందిన రాజ్ కుమార్ బసురాజు ఓ మెడికల్ షాప్ లో  పనిచేస్తున్నాడు. కాగా... అతనికి కొన్ని సంవత్సరాల క్రితం పెళ్లి జరిగింది. కాగా... తరచూ మద్యం సేవించి రాజ్ కుమార్ బసురాజు.. భార్యతో గొడవపడేవాడు. తాజాగా... సోమవారం రాత్రి కూడా అతను పీకలదాకా మద్యం సేవించాడు.

అభ్యంతరం చెప్పినందుకు భార్యతో గొడపడ్డాడు. ఈ క్రమంలోనే భార్య తలపై కొట్టి హత్య చేశాడు.అనంతరం ఇంటి నుంచి బయటకు వచ్చి తన బంధువు ఒకరికి ఫోన్ చేశాడు. తాను తన భార్యను కొట్టానని.. ఇప్పుడు తనకు ఎలా ఉందో చూడాలంటూ అతనిని కోరాడు. అయితే... ఆ బంధువు ఇంటికి వెళ్లి చూసేరికి ఆమె  చనిపోయి ఉంది.

బంధువు ఇంటికి చేరుకునే సమయానికి రాజ్ కుమార్ అక్కడి నుంచి పరారయ్యాడు. కాగా.. ఆ బంధువు వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశాడు. పోలీసులు ఇంటికి వచ్చి చూసేసరికి ఆమె చనిపోచయి ఉంది. ఇంట్లోని ఓ గదిలో మద్యం సీసాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. కాగా... రాజ్ కుమార్ భార్యను ఏ వస్తువుతో కొట్టి చంపాడో మాత్రం తెలియలేదు. సంఘటనా స్థలంలో ఆయుధం ఏమీ తమకు కనిపించలేదని పోలీసులు చెబుతున్నారు.