రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ కానున్నాయి. శ్రీరామనవమి వేడుకల కారణంగా పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు శనివారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు బంద్ చేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.

హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ కానున్నాయి. శ్రీరామనవమి వేడుకల కారణంగా పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు శనివారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు బంద్ చేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించి మద్యం విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వైన్స్ షాపులు, బార్లు మూసివేయాలని పోలీసులు సూచించారు. అయితే స్టార్ హోటల్స్‌, రిజిస్టర్ అయిన్ క్లబ్‌లను దీని నుంచి మినహాయింపు కల్పించారు.

ఇక, హైదరాబాద్తో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బైంసాలో శ్రీరామనవమి శోభాయాత్ర నిర్వహించుకునేందుకు తెలంగాణ హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పోలీసులు మార్గదర్శకాలు పాటించాలని సూచించింది. దీంతో ముందు జాగ్రత్తగా శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకుని శ్రీరామనవమి శోభాయాత్ర ఎలాంటి ఆవాంతరాలు లేకుండా నిర్వహించేలా హైదరాబాద్‌లో మద్యం షాపులను పోలీసులు బంద్ చేయాలని ఆదేశించారు. 

హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. 
ఆదివారం శ్రీరామ‌న‌వమిని పుర‌స్క‌రించుకొని భాగ్య‌న‌గ‌ర్ శ్రీరామ‌న‌వ‌మి ఉత్స‌వ స‌మితి.. సీతారాంబాగ్ ద్రౌప‌ది గార్డెన్స్ నుంచి సుల్తాన్ బ‌జార్ వరకు శ్రీరామ శోభాయాత్ర చేప‌ట్ట‌నుంది. మ‌ధ్యాహ్నం ఒంటి గంట‌కు మొదలుకానున్న శోభాయాత్ర రాత్రి 8 గంట‌ల‌కు కొనసాగనుంది. శోభాయాత్ర సీతారాం బాగ్ టెంపుల్, బోయిగూడ క‌మాన్, గాంధీ విగ్ర‌హం, బేగంబ‌జార్, సిద్ధంబ‌ర్ బ‌జార్, శంక‌ర్‌షేర్ హోట‌ల్, గౌలిగూడ‌, పుత్లీబౌలి ఎక్స్ రోడ్, కోఠి ఆంధ్రా బ్యాంక్ మీదుగా సుల్తాన్ బ‌జార్ చేరుకోనుంది.

దీంతో ఈ రూట్‌లో పోలీసులు ట్రాఫింక్ ఆంక్షలు విధించారు. ఈ మార్గాల్లో వెళ్లే వాహ‌న‌దారులు ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను ఎంచుకోవాల‌ని సూచించారు. మ‌ల్లేప‌ల్లి జంక్ష‌న్, బోయిగూడ క‌మాన్, ఆఘ‌పురా జంక్ష‌న్, పురానాపూల్ ఎక్స్ రోడ్, ముస్లింజంగ్ బ్రిడ్జి, అల‌స్కా టీ జంక్ష‌న్, లేబ‌ర్ అడ్డా, అఫ్జ‌ల్ గంజ్ టీ జంక్ష‌న్, రంగ‌మ‌హ‌ల్ జంక్ష‌న్, పుత్లీబౌలి ఎక్స్ రోడ్, ఆంధ్రా బ్యాంక్ జంక్ష‌న్, డీఎం అండ్ హెచ్ఎస్ జంక్ష‌న్, సుల్తాన్ బ‌జార్ ఎక్స్ రోడ్ వ‌ద్ద ట్రాఫిక్‌ను మ‌ళ్లించ‌నున్నారు.