హైదరాబాద్ నగరం కూకట్ పల్లి ప్రగతి నగర్ లో చిరుతపులి సంచరిస్తోందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. చిరుతపులి గాండ్రిపులు కూడా విన్నామంటూ స్థానికులు అటీవీ శాఖ అధికారులకు ఫిర్యాదు కూడా చేశారు. ఈ వార్త విని ప్రగతినగర్ వాస్తవ్యులు భయంతో వణికిపోయారు. దీంతో బుధవారం కాలనీ వాసులెవరూ మార్నింగ్ వాక్‌కు వెళ్లలేదు. ఈ విషయంపై మీడియాలో భారీగా ప్రచారం జరగడంతో ఫారెస్ట్ అధికారులు ప్రగతినగర్-గాజుల రామారం మధ్య అటవీ ప్రాంతంలో గాలింపు చేపట్టారు.

కాగా... ఫారెస్ట్ అధికారుల తనిఖీల్లో అది చిరుతపులి కాదన్న విషయం తేలిపోయింది. అది అడవి పిల్లి అని అధికారులు పేర్కొన్నారు. అడవి పిల్లి కావడంతో కాస్త పరిమాణంలో పెద్దగా ఉందని... అది పిల్లి కాదని తేల్చి  చెప్పారు. దీంతో.. స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా.. ఈ విషయం బయటకు పొక్కగానే కొందరు ఆకతాయిలు కావాలని పులిలా గండ్రిస్తూ శబ్దాలు చేశారని అధికారులు చెబుతున్నారు. వారిపై చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు.