Asianet News TeluguAsianet News Telugu

నేరెళ్ల దళితులకు లాఠీఛార్జి దెబ్బలేనట

  • నేరెళ్ల దళితులపై లాఠీచార్జి డెబ్బలే
  • హైకోర్టుకు తెలిపిన పోలీసులు
  • కేసు మరో వారానికి వాయిదా
  • నివేదికల్లో తేడాలపై ప్రశ్నించిన హైకోర్టు 
hyderabad high court ask another report on nerella dalit issue

సిరిసిల్ల జిల్లాలోని నేరెళ్ల దళితులపై పోలీసుులు థర్డ్ డిగ్రీ జరపలేదట, కరెంటు షాక్ ఇవ్వలేదట. వారందరికీ లాఠీఛార్జిలో తగిలిన దెబ్బలేనట. ఇదీ తెలంగాణ పోలీసులు హైకోర్టుకు నివేదించిన నివేదికలోని అంశాలు. అయినప్పటికీ స్థానిక ఎస్సై తన పరిధి మీరి దళితులపై లాఠీఛార్జి చేసిన కారణంగా ఆయనపై సర్కారు సస్పెన్షన్ వేటు వేసిందని న్యాయస్థానానికి పోలీసులు వివరించారు.

పోలీసుల వాదనపై హైకోర్టు అనేక అనుమానాలను వ్యక్తం చేసింది. సిరిసిల్ల ఆసుపత్రి వైద్యులు ఇచ్చిన నివేదిక, జైలు అధికారుల నివేదికలోని అంశాలు పొంతన లేకుండా ఉన్నాయని హైకోర్టు పేర్కొంది. రెండు నివేదికల ఆధారం చేసుకుని రెండింటినీ ఒక పట్టికలో పోలుస్తూ మరో నివేదికను అందించాలని తెలంగాణ ఎజి డి.ప్రకాశ్ రెడ్డిని హైకోర్టు ఆదేశించింది.

మంగళవారం సిరిసిల్ల జిల్లా నేరెళ్ల బాధితుల విషయమై కోర్టులో కేసు విచారణ జరిగింది. కేసును ఉమ్మడి హైకోర్టు తత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా హైకోర్టు పలు కీలక అంశాలపై క్లారిటీ కోరింది. బాధితులందరికీ ఒకేచోట, అది కూడా శరీరంలోని రహస్య ప్రదేశంలో గాయాలెలా అయ్యాయని హైకోర్టు ప్రశ్నించింది.

ఈ విషయంలో రెండు నివేదికల్లో సమాచారం వేర్వేరుగా ఉందని తెలిపింది. దీనిపై మరో నివేదిక ఇవ్వాలంటూ ఆదేశాలిచ్చి కేసును వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. పోలీసులు అధికార పార్టీ అండడండలతో నేరెళ్ల బాధితులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని, కరెంటు షాక్ పెట్టారని బాధితుల తరుపు పిటిషనర్ వాదించారు. 

నేరెళ్ల బాధితుల విషయంలో తెలంగాణ మంత్రి కేటిఆర్ ఆదేశాల మేరకే పోలీసులు దళితులను చితకబాదారని, థర్డ్ డిగ్రీ ప్రయోగించారని రాజకీయపక్షాలు  దుమ్మెత్తిపోస్తున్నాయి. మంత్రి కేటిఆర్ ఇసుక మాఫియాను నడుపుతున్నాడని ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీని తప్పించింది. కానీ ఎస్పీపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కేసును సిబిఐ కి అప్పగించాలని కోరుతున్నాయి. రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ రాసిన లేఖను హైకోర్టు పిల్ గా స్వీకరించి విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios