హైదరాబాద్ నగరంలోని ప్రముఖ రెస్టారెంట్ కి జీహెచ్ఎంసీ అధికారులు జరిమానా విధించారు. జన నివాసాల మధ్య వంటశాల ఏర్పాటు చేసి.. కనీసం అగ్నిమాపక ఏర్పాట్లు కూడా చేయని కారణంగా ఓ రెస్టారెంట్ కి జీహెచ్ఎంసీ జరిమానా విధించింది.

పూర్తి వివరాల్లోకి వెళితే....జవహర్‌నగర్‌లో నివాసాల మధ్య చాలా కాలంగా హైదరాబాద్ రెస్టారెంట్‌కు చెందిన కిచెన్ ఉంది. రెస్టారెంట్‌లో సరఫరా చేసే ఆహారాన్ని ఇక్కడ తయారుచేసి తరలిస్తారు. నివాసాల మధ్య ఉన్న కిచెన్‌తో ప్రమాదం పొంచి ఉందన్న ఫిర్యాదు నేపథ్యంలో తనిఖీలు నిర్వహించినట్టు జీహెచ్‌ఎంసీ అధికారులు చెబుతున్నారు.
తనిఖీలు నిర్వహించి... ఫైర్‌సేఫ్టీ, సిల్ట్ ఛాంబర్ లేకపోవడంతో రూ. 10,000 జరిమానా విధించారు. హోటల్‌లోని వ్యర్థాలు నేరుగా డ్రైనేజీలో కలవడం...స్థానికంగా న్యూసెన్స్ జరుగుతున్న దృష్ట్యా ఆయా అంశాలకు సంబంధించి మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు. ఇది రహ్మత్‌నగర్ కార్పొరేటర్ షఫీకి చెందిన రెస్టారెంట్ అని స్థానికులు చెబుతున్నారు.