హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో మరో దారుణం చోటు చేసుకుంది. కరోనా సోకిన వ్యక్తి మరణించి ఏడు గంటలు దాటినా.. అక్కడి సిబ్బంది పట్టించుకోవడం లేదు. దీంతో మృతదేహం నుంచి దుర్వాసన వస్తుండటంతో తోటి రోగులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.  

కాగా కొద్దిరోజుల క్రితం గాంధీలో కరోనా మృతదేహం మాయం కావడం సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే. అలాగే కోవిడ్ 19 మరణించిన వారి మృతదేహాలు మారిపోవడం వంటి ఘటనలు జరిగాయి. దీంతో మృతుల బంధువులు జూనియర్ డాక్టర్లపై దాడికి దిగడం చోటు చేసుకుంది.