Asianet News TeluguAsianet News Telugu

అన్ లైన్ జాబ్ పోర్టల్ పేరుతో కుచ్చుటోపీ.. మహిళతో సహా నలుగురి అరెస్ట్...

 దమ్మాయిగూడకు చెందిన బాధితుడు బత్తుల శ్రీనివాస్ రెడ్డి తన రెజ్యూమెను ఆన్‌లైన్ జాబ్ పోర్టల్ "SHINE.COM" లో అప్‌లోడ్ చేసాడు, ఆ తర్వాత 2021, జనవరిలో బాధితుడికి కొన్ని ఫోన్ కాల్స్, ఇమెయిల్స్ వచ్చాయి. 

Hyderabad : Four arrested for cheating job aspirants through fake online job portal
Author
Hyderabad, First Published Sep 4, 2021, 2:10 PM IST

ఆన్ లైన్ జాబ్ పోర్టల్ ద్వారా నిరుద్యోగులను మోసం చేస్తూ డబ్బులు దండుకుంటున్న ఓ ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో నలుగురు పురుషులు సహా ఓ మహిళ ఉంది. వీరంతా ఢిల్లీకి చెందినవారు. షైన్.కామ్ పేరుతో దేశవిదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని వీరు నిరుద్యోగులకు ఎర వేస్తున్నారు. 

వివరాల్లోకి వెడితే..   దమ్మాయిగూడకు చెందిన బాధితుడు బత్తుల శ్రీనివాస్ రెడ్డి తన రెజ్యూమెను ఆన్‌లైన్ జాబ్ పోర్టల్ "SHINE.COM" లో అప్‌లోడ్ చేసాడు, ఆ తర్వాత 2021, జనవరిలో బాధితుడికి కొన్ని ఫోన్ కాల్స్, ఇమెయిల్స్ వచ్చాయి. 

ఎమ్మెన్సీ కంపెనీలో ఉద్యోగం కోసం రకరకాల ఛార్జీల కింద 
వారు రూ.68,705/- చెల్లించాలని కోరారు. దానికోసం వారిచ్చిన లింకుల ద్వారా పే చేయాలని చెప్పారు. బాధితుడు వారు చెప్పినట్టే చేశాడు. ఆ తరువాత అతనికి కాల్స్ రావడం బందయ్యాయి. అతను కాల్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులకు ఆశ్రయించాడు. 
ఇలాగే యాప్రాల్‌కు చెందిన మరో బాధితుడు ఆర్. సంపత్ రెడ్డిని కూడా మోసం చేసి అతని నుండి రూ. 1,05,000/- వసూలు చేశారు. 
  
నిందితులు ఈ  మోసాల కోసం న్యూఢిల్లీలో  హెచ్ టీ మీడియా అనే కాల్ సెంటర్ నిర్వహిస్తున్న కొంతమంది టెలీ కాలర్ల సహాయం తీసుకున్నారు. వీరు షైన్.కామ్ లో రెజ్యూమ్స్ అప్ లోడ్ చేసిన వ్యక్తులకు కాల్ చేసి.. మొదట రిజిస్ట్రేషన్ ఫీజు కింద కొంత తక్కువ రుసుము వసూలు చేస్తారు. వారు వాటిని కట్టి రిజిస్టర్ అయిన తరువాత.. వెంటనే తాము ఫలానా ఎమ్మెన్సీ కంపెనీ నుంచి కాల్ చేస్తున్నామంటూ చెప్పి కాల్ చేసి వారినుంచి ఎక్కువ మొత్తాలు కట్టేలా చేస్తారు. దీనికోసం బాధితులతో టెలిఫోనిక్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. నకిలీ ఆఫర్/అపాయింట్‌మెంట్ లెటర్‌లను బాధితులకు ఇమెయిల్‌ల ద్వారా పంపుతారు. ఇంకా వారు "సీవీ హైలైటింగ్ ఛార్జీలు, ఆన్‌లైన్ కోర్సు శిక్షణ ఛార్జీలు, మాక్ ఇంటర్వ్యూ ఛార్జీలు, సర్వీస్ ఛార్జీలు, బ్యాంక్ అకౌంట్ ప్రారంభ ఛార్జీలు, సెక్యూరిటీ డిపాజిట్ ఛార్జీలు, వీసా ఛార్జీలు" వంటి అనేక కారణాలను పేర్కొంటూ బాధితులకు భారీ మొత్తాన్ని చెల్లించేలా చేస్తారు.

ఆన్‌లైన్ జాబ్ పోర్టల్స్ నుండి స్వీకరించిన టెలిఫోనిక్/వాట్సాప్/ఇమెయిల్ కమ్యూనికేషన్‌లకు డబ్బు/మొత్తాలను బదిలీ చేయవద్దని, నెటిజన్లు, ఉద్యోగార్దులను పోలీసులు హెచ్చరించారు. అలాంటి టెలిఫోనిక్ కాల్స్/వాట్సాప్ కాల్స్/మెసేజ్‌లలో నిజానిజాలు తెలుసుకోకుండా ముందుకు వెళ్లోద్దని తెలిపారు. 

రాచకొండ పోలీస్ కమీషనర్ మహేష్ భగవత్ సారథ్యంలో, సుధీర్ బాబు అడిషనల్ కమిషనర్ కైషనర్ రాచకొండ, పి.యాదగిరి, DCP నేరాలు,. ఎస్. హరినాథ్, సహాయ పోలీస్ కమిషనర్ కేసును ఇన్‌స్పెక్టర్ శ్రీ దర్యాప్తు చేశారు. ఎన్. రాము సైబర్ క్రైమ్స్, నిందితుడిని పట్టుకున్నారు.

నిందితులు విజయ్ త్యాగి (35), ఘజియాబాద్, పూర్ణిమ గంగూలీ (40), భువన్ చంద్ర భట్ (32) ఢిల్లీ, అమిత్ చౌహాన్ (26) నోయిడాలను అరెస్ట్ చేశారు. వీరినుంచి ఐదు మొబైల్ ఫోన్లు, 17 ల్యాప్‌టాప్‌లు, 3 వై -ఫై రూటర్లు, 1 డివిఆర్ ను స్వాధీనం చేసుకున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios