Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్ వరదలు : ఒక్క గర్భవతి కోసం ప్రత్యేక సర్వీస్ నడిపిన మెట్రో

హైదరాబాద్ నగరం వరదల్లో మునిగిన వేళ ఒక గర్భవతికోసం ప్రత్యేక సర్వీస్ నడిపి ఆమెను తన గమ్యస్థానానికి చేర్చి హైదరాబాద్ మెట్రో తమ కర్తవ్య దీక్షను చాటుకుంది. 

Hyderabad Floods: HMRL Runs A Special Service To Ferry A Pregnant lady
Author
Hyderabad, First Published Oct 17, 2020, 2:10 PM IST

హైదరాబాద్ లో గత  మూడు రోజుల కింద కురిసిన భారీ వర్షం, ఆ తరువాత వరద నీరు ముంచెత్తడం నుంచి ఇంకా హైదరాబాద్ పూర్తి స్థాయిలో తేరుకోలేదు. వరద నీరు తగ్గుముఖం పట్టినా... ఆ వరద గాయాల నుంచి ఇంకా నగరం తేరుకోలేదు. 

భారీ వర్షాలు హైదరాబాద్ ని ముంచెత్తినప్పుడు హైదరాబాద్ అంతా పూర్తిగా వరద నీటిలో మునిగిపోయింది. నగరంలో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. ఎక్కడ చిక్కుకున్నవారు అక్కడే చిక్కుకొనిపోయారు. 

ఇలాంటి పరిస్థితుల్లో ఒక నిండు గర్భిణీ నగరంలోని ఈ చివర నుండి ఆ చివర వరకు వెళ్లవలిసి వచ్చింది. రోడ్లన్నీ పూర్తిగా వరద నీటిలో చిక్కుకొనిపోగా.... మెట్రో ఒక్కటే మార్గంగా కనిపించిన వేళ మెట్రో స్టేషన్ కి చేరుకుంది. మెట్రో  ఎమెర్జెన్సీలో ఆదుకోవడానికి ముందుంటామంటూ ముందుకు వచ్చి ఆ గర్భవతిని గమ్యస్థానానికి చేర్చి తమ కర్తవ్య దీక్షను చాటుకున్నారు. 

వివరాల్లోకి వెళితే... 14వ తారీఖున రామేతి 10 గంటలకు ఒక గర్భవతి విక్టోరియా మెమోరియల్ స్టేషన్ చేరుకున్నారు. సాధారణంగా ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు మాత్రమే మెట్రో సర్వీసులు అందుబాటులో ఉంటాయి. కానీ వేరే మార్గం లేదు అని వచ్చిన ఆమెను స్పెషల్ సర్వీస్ ను నడిపి ఆమె గమ్యస్థానానికి చేర్చారు. 

రాత్రి 10 గంటల తరువాత సర్వీసులు నడపకున్నప్పటికీ... ఎటువంటి విపత్కర పరిస్థతాయినా ఎదురైతే సిద్ధంగా ఉండాలన్న ఆదేశాలను అందుకున్న అన్ని మెట్రో స్టేషన్లు... విక్టోరియా మెమోరియల్ స్టేషన్ కి వచ్చి ఎలాగైనా మియాపూర్ వెళ్లాలని కోరిన ఆ మహిళను ఒక ప్రత్యేక సర్వీస్ ను నడిపి మియాపూర్ చేర్చారు. ఈ విషయాన్ని స్వయంగా మెట్రో రైల్ ఎండి వివరించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios