ఫేక్ మెయిల్: హైద్రాబాద్‌లో రూ. 8 లక్షలు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
హైద్రాబాద్ బాగ్ అంబర్ పేటలో ఫేక్ మెయిల్ పంపి సైబర్ నేరగాళ్లు రూ. 7.5 లక్షలను కొట్టేశారు కేటుగాళ్లు.
హైదరాబాద్: నగరంలోని బాగ్ అంబర్ పేటలోని ఓ సంస్థకు ఫేక్ మెయిల్ పంపి రూ. 7.5 లక్షలను కొట్టేశారు సైబర్ నేరగాళ్లు. తాము మోసపోయినట్టుగా గుర్తించిన ఆ సంస్థ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
హైద్రాబాద్ బాగ్ అంబర్‌పేటకు చెందిన వీబీఆర్ ఆర్గానిక్ సంస్థ ఫేక్ మెయిల్ ను పంపింది. ఈ ఫేక్ మెయిల్ కు ఈ సంస్థ ప్రతినిధులు స్పందించారు. ఈ మెయిల్ లో సూచించినట్టుగా రూ. 7.5 లక్షలను పంపారు. అయితే ఈ డబ్బులు పంపిన తర్వాత తాము మోసపోయినట్టుగా ఆ సంస్థ ప్రతినిధులు గుర్తించారు. ఈ విషయమై వీబీఆర్ ఆర్గానిక్ సంస్థ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రోజుకో కొత్త రూపంలో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. సైబర్ నేరాలను అరికట్టేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అయితే నేరగాళ్లు సరికొత్త మార్గంలో మోసాలకు పాల్పడుతున్నారు. టెక్నాలజీని ఉపయోగించుకుని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు.