హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కాటేదాన్ టీఎన్జీవోస్ కాలనీలోని ఓ ప్లాస్టిక్ పరిశ్రమలో భారీగా మంటలు చెలరేగాయి.
హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కాటేదాన్ టీఎన్జీవోస్ కాలనీలోని ఓ ప్లాస్టిక్ పరిశ్రమలో భారీగా మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. అగ్ని ప్రమాదం వల్ల ఆ ప్రాంతంలో దట్టమైన పొగ అలుముకుంది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న ప్లాస్టిక్ కంపెనీని ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే పరిశ్రమలో మంటలు చెలరేగడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
