హైదరాబాద్ నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన బయో డైవర్శిటీ వద్ద ఆదివారం ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఓ టెక్కీ మోతాదుకి మించి మద్యం సేవించి కారు నడపడంతో ఈ ప్రమాదం జరిగింది. టెక్కీ మద్యం మత్తులో కారు నడుపుతండగా.. ఇద్దరు యువకులు సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో కారు వచ్చి ఆ యువకులను ఢీ కొట్టింది.

కాగా... ఈ ఘటనలో ఆ ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా... మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు సాయి వంశీ, అతని స్నేహితుడు ప్రవీణ్ కుమార్ గా పోలీసులు గుర్తించారు. మురళీ కృష్ణ, సుభాష్ లు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ద్విచక్రవాహనంపై గచ్చిబౌలిపై వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. కాగా... ఈ ప్రమాదానికి కారణమైన వ్యక్తి టెక్కీ అభిలాష్(28)గా గుర్తు చేశారు. అభిలాష్ కూకట్ పల్లికి చెందిన వ్యక్తి కాగా...ఓ ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కాగా... పోలీసులు అభిలాష్ ని అదుపులోకి తీసుకున్నారు. అతనికి పరీక్షలు నిర్వహించగా.... అతని రక్తంలో 200ఎంజీ ఆల్కహాల్ ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.