హైదరాబాద్ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు.. లాభాలు విదేశాలకు మళ్లింపు, హెన్రీ కోసం గాలింపు
హైదరాబాద్ డ్రగ్స్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అక్రమంగా సంపాదించిన డబ్బును నిందితులు విదేశాలకు మళ్లించినట్లుగా హైదరాబాద్ నార్కోటిక్ పోలీసులు గుర్తించారు. కీలక నిందితుడు హెన్రీ కోసం గాలిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హైదరాబాద్ డ్రగ్స్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం ముగ్గురు నైజీరియన్లతో పాటు ఇద్దరు భారతీయులు అరెస్ట్ అయ్యారు. అయితే ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్ తరహాలోనే డ్రగ్స్ కేసుల్లోనూ విదేశాలకు లాభాలు మళ్లించినట్లు హైదరాబాద్ నార్కోటిక్ పోలీసులు గుర్తించారు. ఈ కేసు లావాదేవీలపై ఆరా తీశారు. డ్రగ్స్ కోసం కస్టమర్ల నుంచి రూ.4 కోట్లు వసూలు చేసినట్లు గుర్తించారు. 22 విదేశీ ఖాతాలకు నగదు మళ్లించగా.. ఇందుకోసం 22 బ్యాంక్ ఖాతాలను ఆపరేట్ చేస్తున్నాడు డ్రగ్స్ సప్లయర్ హెన్రీ. దీంతో హెన్రీ కోసం గాలిస్తున్నారు హైదరాబాద్ నార్కోటిక్ పోలీసులు. దాదాపు 200 మంది కస్టమర్లు హెన్రీ వద్ద డ్రగ్స్ తీసుకున్నట్లు గుర్తించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.