డీఆర్‌డీఎల్ హనీట్రాప్ కేసు: నటాషాకు కీలక సమాచారం ఇచ్చిన డీఆర్‌డీఎల్ ఉద్యోగి మల్లిఖార్జున్ రెడ్డి
కంచన్ బాగ్ డీఆర్‌డీఎల్ లో హానీట్రాప్ కేసులో కీలక అంశాలు వెలుగు చూస్తున్నాయి. కె సీరీస్ మిస్సైల్స్ కు చెందిన కీలక సమాచారాన్ని మల్లిఖార్జున్ రెడ్డి నటాషాకు చేరవేశారని పోలీసులు గుర్తించారు.
హైదరాబాద్: Hyderabad నగరంలోని kanchanbagh డీఅర్‌డీఎల్ హనీ ట్రాప్ కేసులో కీలక అంశాలు వెలుగు చూస్తున్నాయి. DRDL లో క్వాలిటీ ఇంజనీర్‌గా పనిచేస్తున్న మల్లికార్జునరెడ్డిని నటాషా అనే మహిళ honey Trap చేసింది. కె సీరీస్ మిస్సైల్‌కు చెందిన కీలక సమాచారాన్ని నటాషాకు Dukka Mallikarjun Reddy చేరవేశాడు.
యూకే అనుసంద డిఫెన్స్ జర్నలిస్ట్ పేరుతో Natasha ఆయనను ట్రాప్ చేసింది. రెండు సంవత్సరాలుగా నటాషాతో మల్లికార్జున్ మాట్లాడుతూ వస్తున్నాడు. 2019 నుంచి 2021 వరకు నటాషాకు మిస్సైల్ కాంపోనెంట్స్ కీలక డేటా చెరవేశాడు. సబ్ మెరైన్ నుంచి మిస్సైల్స్ లాంచ్ చేసే కీలక కే సిరీస్ కోడ్‌ను పాకిస్తానీ స్పైకు మల్లికార్జున్ చేర్చాడు. సిమ్రాన్ చోప్రా, ఒమిషా అడ్డి పేరుతో Face Book ప్రొఫైల్స్‌ను పాకిస్తానీ మెయింటైన్ చేసింది.
ఫేస్‌బుక్ మెసెంజర్ ద్వారా మల్లికార్జున్‌కు మెసేజ్‌లు పంపించినట్టుగా దర్యాప్తు అధికారులు గుర్తించారని మీడియా కథనాలు చెబుతున్నాయి. మల్లికార్జున్ ఫోటోలు, వీడియోలు అడిగినా నటాషా పంపించలేదు. కేవలం చాటింగ్‌తోనే మల్లికార్జున్‌ను నటాషా ట్రాప్ చేసింది. ల్యాప్ టాప్, మొబైల్ ఫోన్‌లో మిస్సైల్‌కు సంబంధించిన కీలక సమాచారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మొబైల్‌లో నటాషా వాయిస్ రికార్డింగ్‌లను సైతం స్వాధీనం చేసుకున్నారు. ఇంగ్లీష్, హిందీలో నటాషా వాయిస్ క్లిప్పింగ్స్ ఉన్నాయి. ఇప్పటికే మల్లికార్జున్ రెడ్డిని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. మల్లికార్జున్‌ను కస్టడీకి తీసుకోవాలని పోలీసులు యోచిస్తున్నారు.
ఈ నెల 17వ తేదీన మల్లిఖార్జున్ రెడ్డిని Rachakonda పోలీసులు అరెస్ట్ చేశారు. హైద్రాబాద్ కు చెందిన దుక్కా మల్లిఖార్జున్ రెడ్డి జాతీయ భద్రతకు విఘాతం కలిగించే సమాచారాన్ని పాకిస్తాన్ తో పంచుకున్నందుకు గాను పోలీసులు అరెస్ట్ చేశారు. 2018లో మల్లిఖార్జున్ రెడ్డి బెంగుళూరుకు చెందిన కంపెనీలో పనిచేసేవాడు.
2020 జనవరిలో డీఆర్‌డీఎల్ కు అసైన్ అయ్యారని పోలీసులు తెలిపారు. డీఆర్‌డీఎల్ మల్లిఖార్జున్ రెడ్డి కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఎఎన్‌సీపీ ప్రాజెక్టులో కాంట్రాక్టు ఉద్యోగిగా కొనసాగుతున్నాడు. హైద్రాబాద్ బాలాపూర్ లోని ఆర్‌సీఐలో మల్లిఖార్జున్ రెడ్డి పనిచేస్తున్నాడు.
also read:హనీట్రాప్‌లో చిక్కుకున్న ఎయిర్‌ఫోర్స్ అధికారి.. భార్య బ్యాంక్ ఖాతాలో అనుమానస్పద లావాదేవీలు..
డీఆర్‌డీఎల్ లో పనిచేస్తున్నట్టుగా మల్లికార్జున్ రెడ్డి తన ఫేస్ బుక్ ప్రొపైల్ లో పేర్కొన్నారు. 2020 మార్చిలో నటాషారావు అనే పేరున్న ఫేస్ బుక్ నుండి మల్లిఖార్జున్ రెడ్డికి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. దీంతో ఈ ఫ్రెండ్ రిక్వెస్ట్ ను ఆయన అంగీకరించాడు.
తాను ఇంతకు ముందు Bangloreలో నివసించానని తన తండ్రి రిటైర్డ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ అని నటాషా మల్లిఖార్జున్ రెడ్డిని నమ్మించింది. 2021 డిసెంబర్ వరకు నటాషా మల్లిఖార్జున్ రెడ్డితో టచ్ లో ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు.