సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల పరిధిలో దారుణం చోటుచేసుకుంది. జిన్నారం అడవుల్లో ఓ యువకుడి మృతదేహం లభించడం తీవ్ర కలకలం రేపింది. గుర్తు తెలియని దుండగులు దాడి చేసి అతడిని హత్య చేసి దహనం చేసినట్లుగా తెలుస్తుంది.
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల పరిధిలో దారుణం చోటుచేసుకుంది. జిన్నారం అడవుల్లో ఓ యువకుడి మృతదేహం లభించడం తీవ్ర కలకలం రేపింది. గుర్తు తెలియని దుండగులు దాడి చేసి అతడిని హత్య చేసి దహనం చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఆ మృతదేహం కేపీహెచ్‌బీ పోలీసు స్టేషన్ పరిధిలో మూడు రోజుల క్రితం కనిపించకుండా పోయిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నారాయణ రెడ్డిదిగా గుర్తించారు. వివరాలు.. మృతుడు నారాయణరెడ్డి కేపీహెచ్‌బీలో నివాసం ఉంటున్నాడు. ఏడాది క్రితం అతడు ఓ యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. యువతి నారాయణరెడ్డిని పెళ్లి చేసుకోవడం ఆమె తల్లిదండ్రులకు ఇష్టం లేదు.
ఈ క్రమంలోనే యువతిని బలవంతంగా తీసుకెళ్లి ఇంట్లో నిర్భందించారు. అయితే ఆ తర్వాత కూడా నారాయణ రెడ్డి, యువతి ఫోన్‌లో మాట్లాడుకునేవారు. అయితే ఈ విషయం తెలిసిన యువతి తల్లిదండ్రులు, బంధువులు నారాయణరెడ్డిని హత్య చేయాలని నిర్ణయించుకన్నారు. ఈ క్రమంలోనే శ్రీనివాస్ రెడ్డిని హత్య చేసి, పెట్రోల్ పోసి జిన్నారం అటవీ ప్రాంతంలో పెట్రోల్ పోసి తగలపెట్టినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు విచారణలో పూర్తి వివరాలు వెలుగులోకి రానున్నాయి.
