ఒకే మహిళతో అక్రమసంబంధాన్ని కలిగివున్న ఇద్దరు యువకుల మద్య జరిగిన గొడవ ఒకరి ప్రాణాలను బలితీసుకుంది. ఈ ఘటన  హైదరాబాద్ పాతబస్తీలో చోటుచేుకుంది. 

హైదరాబాద్: వివాహేతర సంబంధం ఓ యువకుడి నిండు ప్రాణాలను బలితీసుకున్నాయి. ఒకే మహిళతో అక్రమబంధాన్ని కలిగివున్న ఇద్దరు యువకుల్లో ఒకడు మరొకడిపై కత్తితో దాడి చేశాడు. ఈ దారుణం తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. hyderabad ఫలక్ నుమా అచ్చిరెడ్డినగర్ కాలనీలో నివాసముండే ఆటో డ్రైవర్ మహ్మద్ పర్వేజ్(23) అదే ప్రాంతానికి చెందిన ఓ మహిళతో అక్రమ సంబంధాన్ని కలిగివున్నాడు. అదే మహిళ షేక్ అబ్బాస్(22) అనే యువకుడితో కూడా extramarital affair కలిగి వుంది. ఒకరికి తెలియకుండా మరో యువకుడితో అక్రమ బంధాన్ని సాగిస్తోంది సదరు మహిళ. 

అయితే ఇటీవల ఆటో డ్రైవర్ పర్వేజ్ ప్రియురాలి డబుల్ గేమ్ గురించి తెలిసింది. దీంతో అతడు కోపంతో రగిలిపోయాడు. మహిళను మందలించినా ఫలితం లేకుండా పోయింది. హెచ్చరించిన తర్వాత కూడా ఆమె అబ్బాస్ తో అక్రమసంబంధాన్ని కొనసాగించడంతో రగిలిపోయిన పర్వేజ్ దారుణానికి ఒడిగట్టాడు. 

read more ఖమ్మం: కోరిక తీర్చాలంటూ వివాహితుడి వేధింపులు... మనస్తాపంతో మైనర్ బాలిక ఆత్మహత్య

అబ్బాస్ అడ్డు తొలగించుకోవాలని భావించిన పర్వేజ్ స్నేహితుడు అక్రమ్ తో కలిసి పథకం వేసాడు. ఇందులో భాగంగా అక్టోబర్ 1న రాత్రి సమయంలో అబ్బాస్‌కు ఫోన్‌ చేసిన అక్రం బయటికి పిలిచాడు. అతడిని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లగా అప్పటికే అక్కడ కాపగాసిన పర్వేజ్ కత్తితో విచక్షణా రహితంగా దాడిచేసి పరారయ్యారు. 

తీవ్రంగా గాయపడిన అబ్బాస్‌ను కొనఊపిరితో ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అతడు మార్గమద్యలోనే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. కొడుకు హత్యపై ఖదీర్‌బీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా అతడి అక్రమసంబంధం గురించి బయటపడింది. దీంతో ఈ దిశగా విచారణ చేయగా పర్వేజ్ ఈ హత్య చేసినట్లు తేలింది. దీంతో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.