హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌‌లో విబేధాలు మరోసారి రచ్చకెక్కాయి. హెచ్‌సీఏ ప్రెసిడెంట్ Mohammed Azharuddin లేకుండానే స్పెషల్ జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించారు. 

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌‌లో విబేధాలు మరోసారి రచ్చకెక్కాయి. హెచ్‌సీఏ ప్రెసిడెంట్ Mohammed Azharuddin లేకుండానే స్పెషల్ జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్‌లో శివలాల్ యాదవ్, అర్షద్ ఆయూబ్, శేషు నారాయణ, మహేందర్ పాల్గొన్నారు. ఈ మీటింగ్‌లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 9 మంది ఉన్న హెచ్‌సీఏ జనరల్ బాడీని.. 19కి పెంచుతూ తీర్మానం చేశారు. ప్రెసిండెంట్ అజహరుద్దీన్ అవసరం లేకుండానే నిర్ణయాలు తీసుకునేలా యాక్షన్ ప్లాన్ రూపొందించారు. 

ఇక, ఈ ఏడాది సెప్టెంబర్‌లో హెచ్‌సీఏ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇలాంటి తరుణంలో స్పెషల్ జనరల్ బాడీ మీటింగ్ జరగడం సంచలనంగా మారింది. మరోవైపు ఈ మీటింగ్‌ నిబంధనలుకు విరుద్దంగా జరిగిందని అజహరుద్దీన్ కామెంట్ చేశారు. ప్రెసిడెంట్ ఉంటేనే మీటింగ్‌కు వాల్యూ ఉంటుందన్నారు. ప్రెసిడెంట్ లేకుండా చేసిన తీర్మానాలు చెల్లవని ఆయన అన్నారు. దీంతో Hyderabad Cricket Association వ్యవహారం మరోసారి వార్తల్లో నిలిచింది.