నిత్యం నరకం చూపిస్తుడటంతో ఆ తల్లిదండ్రుల ప్రాణం కూడా చివరికి విసుగెత్తికొచ్చింది. ఇలాంటి కొడుకు బతికి ఉన్నా ఒక్కటే చచ్చినా ఒక్కటే అని నిర్ణయానికి వచ్చారు. అన్నను చంపెయ్యాలంటూ తమ్ముడికి పురమాయించి హతమార్చారు.
మేడ్చల్: నిత్యం తాగి రావడం ఇంట్లో గొడవ పెట్టుకోవడం అతనికి అలవాటుగా మారిపోయింది. ఇంటికి పెద్దకొడుకు అయి ఉండి బాధ్యతగా వ్యవహరించాల్సింది పోయి కుటుంబ పరువును మంటగలుపుతూ నవ్వుల పాల్జేస్తున్నాడు. రోజూ తాగి వచ్చి నరకం చూపిస్తున్నాడు. అయినా ఆ తల్లిదండ్రులు భరిస్తున్నారు.
నిత్యం నరకం చూపిస్తుడటంతో ఆ తల్లిదండ్రుల ప్రాణం కూడా చివరికి విసుగెత్తికొచ్చింది. ఇలాంటి కొడుకు బతికి ఉన్నా ఒక్కటే చచ్చినా ఒక్కటే అని నిర్ణయానికి వచ్చారు. అన్నను చంపెయ్యాలంటూ తమ్ముడికి పురమాయించి హతమార్చారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా కాప్రా మండలం వంపుగూడలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే వంపుగూడకు చెందిన మణెమ్మ, శ్రీనివాస్ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్దకుమారు సాయి కుమార్(25), చిన్న కుమారుడు సందీప్. శ్రీనివాస్, మణెమ్మ దంపతులు జీహెచ్ఎంసీలో ఔట్ సోర్సింగ్ విభాగంలో స్వీపర్స్ గా పనిచేస్తున్నారు. పెద్దకుమారుడు సాయికుమార్ పెయింటర్ గా పనిచేస్తుండగా, సందీప్ డ్రైవర్.
అయితే ఇంటికి పెద్దకుమారుడైన సాయికుమార్ మద్యానికి బానిసయ్యాడు. రోజూ తప్పతాగి వచ్చి తల్లిదండ్రులకు నరకం చూపిస్తున్నాడు. తాగి వచ్చి కొడుకు చూపిస్తున్న నరకాన్ని అనుభవిస్తూనే ఉన్నారు.
ఇకపోతే ఏప్రిల్ 25న శ్రీనివాస్, మణెమ్మ దంపతులు తమ 25వ పెళ్లిరోజు వేడుకలు జరుపుకున్నారు. ఆవిషయం పెద్దకుమారుడు సాయికుమార్ కు చెప్పకుండా వేడుకగా చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న సాయికుమార్ తల్లి మణెమ్మ, తమ్ముడు సందీప్ ను తీవ్రంగా కొట్టి గాయపరిచాడు.
దీంతో కోపోద్రిక్తురాలైన తల్లి మణెమ్మ కొడుకును అంతమెుందించాలని నిర్ణయించుకుంది. తన చిన్నకుమారుడు సందీప్ కు అన్న సాయికుమార్ ను చంపించాలని పురమాయించింది. అందుకు డబ్బులు కూడా ఇచ్చారు. సందీప్ ఏప్రిల్ 25న తన స్నేహితులు ఫయాజ్, సందీప్ కుమార్, ఇబ్రహీంలకు విషయం చెప్పాడు.
సందీప్ అతని స్నేహితులతో కలిసి అన్న సాయికుమార్ ను హత్య చేసేందుకు ప్లాన్ వేశాడు. ఏప్రిల్ 26న తన అన్నను సందీప్ తన నలుగురు స్నేహితులతో కలిసి వంపుగూడలోని ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ బీరు బాటిల్ పగుల గొట్టి దాంతో గొంతు కోసి సాయిని చంపారు.
తమ కొడుకు హత్యకు పురమాచింది శ్రీనివాస్, మణెమ్మ దంపతులు అయినప్పటికీ తన పెద్దకుమారుడు కనిపించడం లేదని జవహర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు.
అయితే సాయి అనే యువకుడిని చంపినట్లు సందీప్ స్నేహితుడు ఒకరు స్థానిక నేతకు చెప్పాడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సందీప్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో శ్రీనివాస్, మణెమ్మ, సందీప్, ఫయాజ్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు ఇబ్రహీం పరారీలో ఉన్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.
