Asianet News TeluguAsianet News Telugu

లాక్ డౌన్ ఉల్లంఘన: హైదరాబాద్ లో కార్పొరేటర్ పుట్టినరోజు వేడుకలు

మహారాష్ట్రలో, కర్ణాటకలో ఎమ్మెల్యేలు తమ బర్త్ డే వేడుకలు నిర్వహించి లాక్ డౌన్ నిబంధనలకు నీళ్లొదిలిన ఘటన మరువక ముందే... మన హైదరాబాద్ నగరానికి చెందిన ఒక కార్పొరేటర్ ఇలా లాక్ డౌన్ నియమాలను ఉల్లంఘించాడు. 
Hyderabad Corporator breaches lockdown norms, celebrates birthday
Author
Hyderabad, First Published Apr 17, 2020, 12:15 AM IST
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న వేళా సోషల్ డిస్టెంసింగ్ మాత్రమే శ్రీరామ రక్ష అని ప్రభుత్వం ఎంత చెప్పినా ఆ విషయాలను  మాత్రం కొందరు ప్రజలు పాటించడం లేదు. వారికి అర్ధమయ్యే రీతిలో చెప్పాల్సిన స్థాయిలో పోలీసులు చెబుతున్నారు అది వేరే విషయం. 

ప్రజలు ఇలా ఉన్నారంటే ఏదో తెలియక అనుకోవచ్చు. కానీ కొందరు ప్రజా ప్రతినిధులు సైతం ఇలా లాక్ డౌన్ నియమాలను ఉల్లంఘిస్తున్నారు. మహారాష్ట్రలో, కర్ణాటకలో ఎమ్మెల్యేలు తమ బర్త్ డే వేడుకలు నిర్వహించి లాక్ డౌన్ నిబంధనలకు నీళ్లొదిలిన ఘటన మరువక ముందే... మన హైదరాబాద్ నగరానికి చెందిన ఒక కార్పొరేటర్ ఇలా లాక్ డౌన్ నియమాలను ఉల్లంఘించాడు. 

వివరాల్లోకి వెళితే జియాగూడ డివిజన్ తెరాస కార్పొరేటర్ మిత్ర కృష్ణ తన పుట్టినరోజు సందర్భంగా దాదాపుగా 50 మంది ప్రజల సమక్షంలో తన పుట్టినరోజు వేడుకలను నిర్వహించాడు. 

షామియానాలు కట్టి, అందంగా అలంకరించిన పందిరిలో కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలను నిర్వహించాడు. ఆయన, ఆ వేడుకకు వచ్చినవారిలో కూడా కొందరు మాస్కులు ధరించగా కొందరు మాత్రం ధరించలేదు. 

ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ గా మారింది. లాక్ డౌన్ నియమాలను అధికార తెరాస కు చెందిన ప్రజాప్రతినిధులే ఉల్లంఘిస్తుంటే.... వీరు ప్రజలకు ఏమని సందేశం ఇస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 

ఈ సదరు కార్పొరేటర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్ నుంచి కార్పొరేటర్ గా గెలిచిన ఈ సదరు నేత... గత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో తెరాసలో చేరి తెరాస అభ్యర్థిగా జియాగూడ నుంచి గెలుపొందాడు. 

ఇకపోతే తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తెలంగాణలో నిన్న ఒక్క రోజే 50 కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు. దీంతో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 700కు చేరుకుంది. కొత్త కేసులన్నీ జిహెచ్ఎంసీ పరిధిలోనే నమోదైనట్లు ఆయన తెలిపారు. కరోనాతో ఇప్పటి వరకు 18 మరణించినట్లు ఆయన తెలిపారు. 

మర్కజ్ కు వెళ్లి వచ్చిన 6గురి వల్ల 81 మందికి కరోనా వైరస్ సోకిందని మంత్రి గురువారం సాయంత్రం మీడియా సమావేశంలో చెప్పారు. మర్కజ్ వెళ్లి వచ్చినవారంతా స్వచ్ఛందంగా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. ఈ రోజు 68 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయినట్లు తెలిపారు. కరోనా వైరస్ కేసులు పెరిగినా, తగ్గినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అన్నింటికీ సన్నద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. 

ప్లాస్మా థెరపీ అనుమతి కోసం ఐసీఎంఆర్ కు రాశామని మంత్రి చెప్పారు. కరీనంగర్ లో ఇంటింటి సర్వే వల్ల మంచి ఫలితాలు వచ్చినట్లు ఆయన తెలిపారు. రాజకీయ నేతలు ఆత్మస్థయిర్యం దెబ్బ తీసే మాటలు మాట్లాడడం మంచిది కాదని, పీపీఈ కిట్లు, మాస్కులు లేవని కొంత మంది రాజకీయ నాయకులు అంటున్నారని ఆయన అన్నారు. 

రోజుకు 3 లక్షల మాస్కులు తయారు చేసే సామర్థ్యం తమకు ఉందని ఆయన చెప్పారు. గచ్చిబౌలి ఆస్పత్రిలో మరో 1500 పడకలు పెంచుతున్నట్లు ఆయన తెలిపారు. దాన్ని ఈ నెల 20వ తేదీన ప్రారంభిస్తామని అన్నారు. రోజుకు 20 లక్షల టెస్టులు నిర్వహించే విధంగా సామర్థ్యం పెంచుకుంటున్నట్లు రాజేందర్ తెలిపారు. బ్యాంకుల వద్ద ప్రజలు సామాజిక దూరం పాటించాలని, ప్రజల జబ్బులు ఎక్కడికీ పోవని ఆయన అన్నారు.

వైద్యులకు అన్ని రకాల సౌకర్యాలు కలిపిస్తున్నామని, రాష్ట్రంలోని అన్ని లాబ్ లలో టెస్టులు స్థాయి ని భట్టి చేస్తున్నారని రాజేందర్ చెప్పారు. ఇప్పుడు ఉన్న వాటితో పాటు మరో రెండు లాబ్ లకు కేంద్రం అనుమతి ఇచ్చిందని, ఈ రెండు లాబ్ లు 18వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని, మరో మూడు వారాల్లో అధునాతన యంత్ర పరికరాలు అందుబాటులో ఉంటాయని ఆయన చెప్పారు.

కరోనా కేసులు ఒక రోజు పెరుగుతూ..మరొక రోజు తగ్గుతున్నాయని, పాజిటివ్ కేసులు ఎప్పటికప్పుడు డిచార్జ్ కూడా అవుతున్నారని చెప్పారు.10లక్షల పీపీఈ కిట్స్- ఎన్95 మాస్క్ అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పీపీఈ కిట్స్ అండ్ ఎన్95 మాస్క్ లు సరఫరా చేశామని చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios