Asianet News TeluguAsianet News Telugu

వేధిస్తున్నారని సీఐడీ ఎస్పీ పై మహిళ ఫిర్యాదు: హైద్రాబాద్ చైతన్యపురి పోలీసుల కేసు నమోదు

ఓ మహిళ ఫిర్యాదు మేరకు సీఐడీ ఎస్పీ కిషన్ సింగ్ పై  హైద్రాబాద్ చైతన్యపురి పోలీసులు కేసు నమోదు  చేశారు.  తనను వేధిస్తున్నారని  ఎస్పీపై  మహిళ ఫిర్యాదు చేసింది.

Hyderabad  Chaitanyapuri Police Files  Case Against  CID SP  Kishan Singh
Author
First Published Jul 30, 2023, 9:59 AM IST

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో  సీఐడీ విభాగంలో  ఎస్పీ ర్యాంకులో పనిచేస్తున్న  కిషన్ సింగ్ పై  కేసు నమోదైంది.ఓ మహిళ ఫిర్యాదు మేరకు  పోలీసులు  కేసు నమోదు  చేశారు.  నగరంలోని  దిల్‌సుఖ్ నగర్ కొత్తపేటలో టీఎస్‌పీఎస్‌‌పీడీసీఎల్  విభాగంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగి  సీఐడీ ఎస్పీపై  ఫిర్యాదు  చేసింది. తన  ఫోన్ కు  సీఐడీ ఎస్పీ అసభ్యకరమైన  మేసేజ్ లు, ఫోటోలు పంపుతున్నారని  మహిళ ఫిర్యాదు చేసింది.ఈ ఫిర్యాదుపై  హైద్రాబాద్ చైతన్యపురి పోలీసులు విచారణ నిర్వహించి  కేసు నమోదు  చేశారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios