Asianet News TeluguAsianet News Telugu

లోన్‌యాప్స్ కేసు: నేడు కోర్టులో చార్జీషీట్ దాఖలు చేయనున్న సీసీఎస్ పోలీసులు

 లోన్ యాప్స్ కేసులో హైద్రాబాద్ సీసీఎస్ పోలీసులు బుధవారం నాడు కోర్టులో చార్జీషీట్ దాఖలు చేయనున్నారు.లోన్ యాప్స్ కేసులో ఇప్పటికే 20 మందిని అరెస్ట్ చేశారు.

Hyderabad CCS police to submit chargesheet on loan apps case lns
Author
Hyderabad, First Published Mar 24, 2021, 10:26 AM IST

హైదరాబాద్: లోన్ యాప్స్ కేసులో హైద్రాబాద్ సీసీఎస్ పోలీసులు బుధవారం నాడు కోర్టులో చార్జీషీట్ దాఖలు చేయనున్నారు.లోన్ యాప్స్ కేసులో ఇప్పటికే 20 మందిని అరెస్ట్ చేశారు. దేశంలోని పలు నగరాల్లో యాప్స్ కార్యక్రమాలను నిర్వహిస్తున్న వారిపై దాడులు చేసి సీసీఎస్ పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. నిందితుల నుండి కీలకపత్రాలను స్వాధీనం చేసుకొన్నారు.

గూగుల్ ప్లే స్టోర్ నుండి 197 మొబైల్ యాప్స్ ద్వారా నిందితులు పెద్ద ఎత్తున రుణాలను ఇచ్చినట్టుగా పోలీసులు గుర్తించారు.అత్యధిక వడ్డీతో రూ. 10 వేల లోపు రుణాలు ఇచ్చేవారు. యాప్స్ ఇన్ స్టాల్ చేసుకొన్న వెంటనే  రుణాలు ఖాతాదారుడి బ్యాంకు అకౌంట్ లో జమ అయ్యేవి.

గడువులోపుగా ఈ డబ్బులు జమ చేయని ఖాతాదారులను వేధింపులకు గురి చేసేవారు. ఈ వేధింపులు భరించలేక  తెలంగాణలో సుమారు ఆరుగురు మరణించారు. ఏపీలో సుమారు 10 మంది చనిపోయారు.

ఈ విషయమై రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో దేశంలోని పలు నగరాల్లో నిందితులు కాల్ సెంటర్లను నిర్వహించిన విషయాలను కూడ పోలీసులు గుర్తించారు.

బెంగుళూరులో నాలుగు కాల్ సెంటర్లను ఏర్పాటు చేశారు. దేశంలోని ప్రధానమైన నాలుగు నగరాల్లో కూడ కాల్ సెంటర్లను కూడ ఏర్పాటు చేసి  రుణాలు చెల్లించని వారిని వేధింపులకు గురి చేస్తున్నట్టుగా విచారణలో పోలీసులు గుర్తించారు.

చైనా నుండే ప్రధానంగా ఈ లోన్ యాప్స్ కార్యక్రమాలను నిర్వహించినట్టుగా గుర్తించారు.లోన్ యాప్స్ ను చైనాకు చెందిన లాంబో కార్యక్రమాలను నిర్వహించినట్టుగా పోలీసులు గుర్తించారు.

ఇండియాలో జెన్నీఫర్ ద్వారా ఈ కార్యక్రమాలను లాంబో నిర్వహించారని పోలీసులు గుర్తించారు. లోన్ యాప్స్ పై పోలీసులు కేసులు నమోదు చేయడంతో  జెన్నీఫర్ ఇండియా నుండి పారిపోయాడు. చైనాలో జెన్నీఫర్ తలదాచుకొన్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

జెన్నీఫర్ ను ఇండియాకు రప్పించేందుకు సీసీఎస్ పోలీసులు లుక్‌ఔట్ నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో మొత్తం 22 వేల కోట్ల వ్యాపారం జరిగిందని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో చార్జీషీట్ ను పోలీసులు ఇవాళ కోర్టులో దాఖలు చేయనున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios