ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన వారికి చాలానా వేయడం సర్వసాధారణం. అయితే... ఇది కేవలం సామాన్యులకు మాత్రమే వర్తిస్తుందని.. సెలబ్రెటీలు.. ఉన్నత పదువుల్లో ఉన్నవారికి మాత్రం ఇలాంటి రూల్స్ ఏమీ ఉండవని చాలా మంది భావిస్తుంటారు. అయితే.. అది ఎంత మాత్రం నిజం కాదని తెలంగాణ ట్రాఫిక్ అధికారులు నిరూపించారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ కాన్వాయ్‌లోని ఓ కారుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చలానా విధించారు. హైదరాబాద్, సైబరాబాద్, సూర్యాపేట పరిధిలో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఫైన్ వేశారు. పరిమితికి మించిన వేగంతో నాలుగు సార్లు ప్రయాణించినందుకు గాను చలానా విధించినట్లు అధికారులు చెప్పారు. 

హైదరాబాద్‌లో రెండు, సైబరాబాద్‌లో ఒకటి, సూర్యాపేట జిల్లాలో మరో ఫైన్ విధించారు. గతేడాది అక్టోబర్ 16న కోదాడ సమీపంలోని శ్రీరంగాపురంలో తొలిసారి ఫైన్ విధించగా.. ఈ ఏడాది ఏప్రిల్ 15న మాదాపూర్ పరిధిలో రెండోది.. ఏప్రిల్ 29న టోలిచౌకి పరిధిలో మూడోది, జూన్ 1న ట్యాంక్‌బండ్ పరిధిలో నాలుగో ఫైన్ విధించారు.

సీఎం క్వానాయ్‌లో TS 09 K 6666 గల ల్యాండ్ క్రూజన్ ప్రాడో కారుకు ఈ జరిమానా పడింది. సీఎం కాన్వాయ్‌కు ఫైన్ పడిన విషయం మీడియాలో రావడంతో సీఎం కార్యాలయం వెంటనే స్పందించిది.  ఈ నేపథ్యంలో చలానా మొత్తం రూ. 4,140ను సీఎం కార్యాలయం అధికారులు బుధవారం చెల్లించారు.