హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో శనివారం సాయంత్రం భారీ చోరీ జరిగింది. నగరానికి చెందిన స్థిరాస్తి వ్యాపారి సంతోష్‌రెడ్డికి సొంత డ్రైవర్ షాకిచ్చాడు. రూ.55 లక్షలతో పాటు కారుతో సహా ఉడాయించాడు. కొద్దిసేపటి తర్వాత సంతోష్‌ ఫోన్‌ చేయగా శ్రీనివాస్‌ ఫోన్‌ స్విచాఫ్‌ అని వస్తోంది. దీంతో బాధితుడు జూబ్లీహిల్స్‌ పోలీసులను ఆశ్రయించారు.

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో శనివారం సాయంత్రం భారీ చోరీ జరిగింది. నగరానికి చెందిన స్థిరాస్తి వ్యాపారి సంతోష్‌రెడ్డికి సొంత డ్రైవర్ షాకిచ్చాడు. మరో స్థిరాస్తి వ్యాపారికి ఇవ్వమని చెప్పి డ్రైవర్‌ శ్రీనివాస్‌కు రూ.55 లక్షలు ఇచ్చారు సంతోష్. కానీ శ్రీనివాస్‌ ఆ డబ్బు వ్యాపారికి ఇవ్వకుండా రూ.55 లక్షలతో పాటు కారుతో సహా ఉడాయించాడు. కొద్దిసేపటి తర్వాత సంతోష్‌ ఫోన్‌ చేయగా శ్రీనివాస్‌ ఫోన్‌ స్విచాఫ్‌ అని వస్తోంది. దీంతో బాధితుడు జూబ్లీహిల్స్‌ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు శ్రీనివాస్ కోసం గాలిస్తున్నారు.