ఉద్యోగం ఇప్పిస్తామంటూ సౌదీకి తీసుకువెళ్లి...

https://static.asianetnews.com/images/authors/d7f5adfb-1610-5d53-be8e-55db5850d97e.jpg
First Published 15, May 2019, 10:38 AM IST
Hyderabad-based woman stranded in Riyadh, family urges Sushma Swaraj to rescue her
Highlights


సౌదీలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి తీసుకువెళ్లి నరకం చూపించారు. ఆ నరకం నుంచి రక్షించాలంటూ యువతి కుటుంబసభ్యులు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ని కోరుతున్నారు.

సౌదీలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి తీసుకువెళ్లి నరకం చూపించారు. ఆ నరకం నుంచి రక్షించాలంటూ యువతి కుటుంబసభ్యులు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ని కోరుతున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే... హైదరాబాద్ కి చెందిన యువతి గౌషియా బేగమ్.. బాగా చదువుకుంది. ఆమెకు రియాద్ లో మంచి ఉద్యోగం ఇస్తామంటూ కొందరు వారిని సంప్రదించారు. రోజుకి నాలుగు గంటలు పనిచేస్తే సరిపోతుందని... మంచి జీతం వస్తుందని నమ్మించారు. అవి నమ్మి గౌషియా బేగమ్ అక్కడ అడుగుపెట్టింది.

కాగా... చదువు తగ్గ ఉద్యోగం కాకుండా... గొడ్డు చాకిరీ చేయించడం మొదలుపెట్టారు. కనీసం తిండి కూడా పెట్టకుండా హింసించడం మొదలుపెట్టారు. తిరిగి స్వదేశానికి వెళ్లడానికి కూడా అనుమతించలేదు. ఈ ఏడాది మార్చిలో గౌషియా అక్కడ అడుగుపెట్టింది. నెల గడిచినా జీతం ఇవ్వకుండా దారుణంగా కొట్టేవారని గౌషియా సోదరి రెహ్మత్ బేగమ్ తెలిపారు.

తమ సోదరిని ఎలాగైనా స్వదేశానికి తీసుకురావాలంటూ... రెహ్మత్ కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ని కోరుతున్నారు. కాగా.. ఈ మేరకు ఆమె మీడియా ద్వారా తన సోదరి పడుతున్న కష్టాలను వివరించారు. 

loader