హైదరాబాద్‌లో అదృశ్యమైన యువతి సాయిప్రియ కథ విషాదాంతమైంది. ఆమెను ప్రియుడే వనపర్తిలో దారుణంగా హతమార్చాడు

హైదరాబాద్‌లో అదృశ్యమైన యువతి సాయిప్రియ కథ విషాదాంతమైంది. ఆమెను ప్రియుడే వనపర్తిలో దారుణంగా హతమార్చాడు. సాయిప్రియను హత్య చేసి పూడ్చిపెట్టాడు ప్రియుడు శ్రీశైలం. నాలుగు రోజుల క్రితం సాయిప్రియ హైదరాబాద్ నుంచి అదృశ్యమైంది. తనను వివాహం చేసుకోవాలని సాయిప్రియపై శ్రీశైలం ఒత్తిడి తీసుకొచ్చాడు. పెళ్లికి ఆమె ససేమిరా అనడంతోనే సాయిప్రియను హతమార్చాడు. అనంతరం వనపర్తి సమీపంలో సాయిప్రియ మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు శ్రీశైలం. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నాలుగు రోజులుగా సాయిప్రియ కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. చివరికి వనపర్తిలో సాయిప్రియ ఆచూకీ కనిపెట్టిన పోలీసులు.. ఆమె మృతదేహాన్ని వెలికి తీశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.