ఎక్కువసార్లు ఆ కుటుంబానికే లడ్డూ: బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం చరిత్ర ఇదీ....
బాలాపూర్ లడ్డూ వేలం పాటకు దేశ వ్యాప్తంగా ప్రసిద్ది. ఈ వేలం పాటలో వచ్చిన డబ్బులతో గ్రామాభివృద్దికి ఖర్చు చేయనున్నారు. వందల నుండి ప్రారంభమైన వేలం పాట లక్షలకు చేరుకుంది.
హైదరాబాద్: వినాయక చవితి అంటే హైద్రాబాద్ వాసులకు గుర్తుకు వచ్చేది ఖైరతాబాద్ గణేష్ భారీ విగ్రహం, బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం. ప్రతి ఏటా వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరూ ఈ రెండు విషయాలపై చర్చించుకుంటారు. ఇంతై ఇంతింతై వటుడింతై అన్నట్టుగా బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం పాట దేశ వ్యాప్తంగా ప్రసిద్ది పొందింది. వందల నుండి ప్రారంభమైన వేలం ప్రస్తుతం లక్షలకు చేరుకుంది. బాలాపూర్ లడ్డూను వేలంలో దక్కించుకున్న వారికి మంచి జరుగుతుందని విశ్వాసం. దీంతో ఈ లడ్డూను దక్కించుకొనేందుకు భక్తులు వేలం పాటలో పోటీ పడుతారు. ఈ లడ్డూను దక్కించుకొనేందుకు గతంలో లడ్డూను దక్కించుకొన్న వారు కూడ మళ్లీ మళ్లీ పోటీలు పడుతుంటారు.
1994 లో బాలాపూర్ లడ్డూ వేలం పాట ప్రారంభమైంది. బాలాపూర్ గణేష్ ఉత్సవ సమతి ఆధ్వర్యంలో ప్రతి ఏటా బాలాపూర్ గణేష్ నవరాత్రోత్సవాలు నిర్వహిస్తారు. బాలాపూర్ గణేష్ వద్ద ప్రత్యేక పూజలు అందుకున్న లడ్డూను గ్రామంలో వేలం వేస్తారు. బాలాపూర్ లో బొడ్రాయి వద్ద వేలం వేసిన తర్వాత బాలాపూర్ గణేష్ విగ్రహాం శోభాయాత్ర ప్రారంభం కానుంది. ఈ వేలం పాట ద్వారా వచ్చిన డబ్బులను గ్రామాభివృద్దికి గణేష్ ఉత్సవ కమిటీ ఖర్చు చేయనుంది. ఈ నిధులను ఎక్కడెక్కడ ఎంత ఖర్చు చేశారనే విషయాన్ని ఫ్లెక్సీల రూపంలో గ్రామంలో ఏర్పాటు చేస్తారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలోని తాపేశ్వరం నుండి బాలాపూర్ గణేషుడికి లడ్డూను పంపుతారు.
1990లో రూ. 450లకు లడ్డూను కొలను కుటుంబ సభ్యులు దక్కించుకున్నారు. ఈ లడ్డూను ఎక్కువ దఫాలు కొలను కుటుంబ సభ్యులు వేలం పాటలో దక్కించుకున్నారు. 1995లో కూడ కొలను మోహన్ రెడ్డి కుటుంబం రూ. 4500 లకు ఈ లడ్డూను దక్కించుకుంది. 1996లో కొలను కృష్ణారెడ్డి రూ.18,000లకు దక్కించుకున్నారు. 1997లో కొలను కృష్ణారెడ్డి రూ. 28 వేలకు ఈ లడ్డును కైవసం చేసుకున్నారు. 1998లో కొలను మోహన్ రెడ్డి రూ. 51,000లకు లడ్డూను పొందారు. 1999లో కొలను కుటుంబ సభ్యులు కాకుండా కళ్లెం ప్రతాప్ రెడ్డి ఈ లడ్డూను దక్కించుకున్నారు. రూ. 65 వేలకు ప్రతాప్ రెడ్డి ఈ లడ్డూను పొందారు.
2000లో కళ్లెం అంజిరెడ్డి రూ. 66 వేలకు లడ్డూను దక్కించుకున్నారు. 2001లో జి.రఘునందన్ చారి రూ. 85 వేలకు,2002లో కందాడ మాధవ రెడ్డి రూ. 1.05 లక్షలకు లడ్డూను కైవసం చేసుకున్నారు. 2003లో చిగురంత తిరుపతి రెడ్డి రూ. 1.55 లక్షలకు లడ్డూను పొందారు. 2004లో కొలను కుటుంబ సభ్యులు లడ్డూను దక్కించుకున్నారు. కొలను మోహన్ రెడ్డి రూ. 2.01 లక్షలకు ఈ లడ్డూను గెలుచుకున్నారు.
2005లో ఇబ్రహీం శేఖర్ రూ. 2.08 లక్షలకు లడ్డూను పొందారు. 2006లో చిగురంత తిరుపతి రెడ్డి రూ. 3 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు.2007లో జి. రఘునందన్ చారి రూ. 4.15 లక్షలకు లడ్డూను కైవసం చేసుకున్నారు. 2008లో మరోసారి కొలను మోహన్ రెడ్డి కుటుంబం రూ. 5.07 లక్షలను లడ్డూను దక్కించుకుంది.2009లో సరిత రూ. 5.10 లక్షలకు లడ్డూను గెలుచుకుంది.
2010లో కొడాలి శ్రీధర్ బాబు రూ. 5.35 లక్షలకు లడ్డూను పొందారు. అయితే 2011లో మరోసారి కొలను బ్రదర్స్ ఈ లడ్డూను దక్కించుకున్నారు. రూ. 5.45 లక్షలకు లడ్డూను కొనుగోలు చేశారు.2012లో పన్నాల గోవర్థన్ రూ. 7.50 లక్షలకు, 2013లో తీగల కృష్ణారెడ్డి రూ. 9.26 లక్షలకు లడ్డూను పొందారు. 2014లో సింగిరెడ్డి జైహింద్ రెడ్డి రూ. 9.50 లక్షలకు లడ్డూను కైవసం చేసుకున్నారు.
also read:హైద్రాబాద్ ఖైరతాబాద్ శోభాయాత్ర ప్రారంభం: ట్యాంక్ బండ్ వైపు కదులుతున్న గణపయ్య
2015లో కళ్లెం మదన్ మోహన్ రెడ్డి రూ. 10.32 లక్షలకు లడ్డూ పొందారు.2016లో రూ. 14.65 లక్షలకు స్కైలాబ్ రెడ్డి, 2017లో నాగం తిరుపతి రెడ్డి రూ. 15.60 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు.
2018లో శ్రీనివాస్ గుప్తా రూ. 16.60 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు.
2019లో కొలను రాంరెడ్డి రూ.17.50 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు.కరోనా కారణంగా 2020లో బాలాపూర్ గణేష్ వేలం పాట నిర్వహించలేదు.ఈ లడ్డూను సీఎం కేసీఆర్ కు అందించారు. 2021లో ఏపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ అతని స్నేహితుడు శశాంక్ రెడ్డి ఈ లడ్డూను రూ.18.90 లక్షలకు కైవసం చేసుకున్నారు.2022లో వంగేటి లక్ష్మారెడ్డి రూ.24.60 లక్షలకు దక్కించుకున్నారు.
బాలాపూర్ ను లడ్డూను దక్కించుకొంది వీరే...
1) కోలన్ మోహన్ రెడ్డి 450/ - 1994.
2 కోలన్ మోహన్ రెడ్డి 4500/ -. 1995.
3)కోలన్ కృష్ణారెడ్డి 18000 /-. 1996.
4)కోలన్ కృష్ణారెడ్డి 28000/- 1997.
5) కోలన్ మోహన్ రెడ్డి 51000/ - 1998.
6) కళ్ళెం ప్రతాప్ రెడ్డి 65000/- 1999.
7) కళ్ళం అంజి రెడ్డి 66000/- 2000.
8)జి. రఘునందన్ చారి 85000/- 2001.
9) కందాడ మాధవరెడ్డి 105000/- 2002.
10) చిగురంత బాల్ రెడ్డి 1,55000/- 2003.
11) కోలన్ మోహన్ రెడ్డి 2,01000 2004.
12) ఇబ్రహీం శేఖర్ 2,08000 2005.
13)చిగురంత తిరుపతి రెడ్డి 300000 2006.
14)G.రఘునందన్ చారి 4,15000/- 2007.
15) కోలన్ మోహన్ రెడ్డి 5,07000/- 2008.
16) సరిత 510000/- 2009.
17) కోడలి శ్రీధర్ బాబు 535000/- 2010.
18) కోలన్ బ్రదర్స్ 545000/- 2011.
19)పన్నాల గోవర్ధన్ 750000/- 2012.
20)తీగల కృష్ణ రెడ్డి 926000/- 2013.
21) సింగిరెడ్డి జైహింద్ రెడ్డి 950000/- 2014.
22)కళ్లెం మదన్ మోహన్ రెడ్డి 1032000/- 2015.
23) స్కైల్యాబ్ రెడ్డి 14,65000 /- 2016.
24) నాగం తిరుపతి రెడ్డి 1560000 /- 2017.
25) శ్రీనివాస్ గుప్తా 16.60000 /- 2018
26) కొలను రాంరెడ్డి. 17.50 లక్షలు -2019
27). కరోనా కారణంగా వేలం పాట నిర్వహించలేదు. కానీ ఈ లడ్డూను కేసీఆర్ కుుటుంబానికి అందించారు. 2020
28.) ఏపీ ఎమమెల్సీ రమేష్ యాదవ్, శశాంక్ రెడ్డి. రూ.18.90 లక్షలు - 2021
29).వంగేటి లక్ష్మారెడ్డి రూ. 24.60 లక్షలు- 2022