లిఫ్ట్ మీద పడి ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే... మల్కాజిగిరికి చెందిన శంకరయ్య అనే వ్యక్తి భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. కాగా..  అతను ఇటీవల  వాణినగర్ లోని వరుణ్ టవర్స్ అపార్ట్ మెంట్ లో పనికి కుదిరాడు.

అందులో భాగంగా... మంగళవారం రాత్రి అతను లిఫ్ట్ షాప్ట్ లో  పనులు చేస్తుండగా... ప్రమాదవశాత్తు.. ఐదో అంతస్థు నుంచి లిఫ్ట్ వచ్చి... శంకరయ్యపై పడింది. దీంతో... అతను తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే తోటి కార్మికులు అతనిని గాంధీ ఆస్పత్రికి తరలించగా... చికిత్స పొందుతూ కన్నుమూశాడు.

కాగా... శంకరయ్య కుటుంబసభ్యులు ఈ విషయంలో పోలీసులను ఆశ్రయించారు. యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే అతను  చనిపోయాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు... వరుణ్ టవర్స్ అపార్ట్ మెంట్ యాజమాన్యంపై కేసు ఫైల్ చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది.