చెక్క టేబుల్ మీదపడి నాలుగేళ్ల చిన్నారి మృతి చెందాడు. ఈ సంఘటన కూకట్ పల్లి హౌసింగ్ బోర్డ్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.... సంగారెడ్డికి చెందిన రుక్మిణి(24) అనే మహిళ తన ఇద్దరు  చిన్నారులు విక్రమ్(5), హృతిక్ రోషన్(4) తో కలిసి హైదరాబాద్ వచ్చింది.

కేపీహెచ్ బీలో వాచ్ మెన్ గా పనిచేస్తూ...  కుటుంబాన్ని పోషిస్తుంది. కాగా... సోమవారం రాత్రి.... హృతిక్ రోషన్ నిద్రపోయిన తర్వాత... రుక్మిణి తన పెద్ద కొడుకు విక్రమ్ తో కలిసి పని ఉండి బయటకు వెళ్లింది.

తిరిగి ఇంటికి వచ్చి చూసే సమయానికి రోషన్ చెక్క టేబుల్ కింద ఇరుక్కుపోయి కూర్చున్నాడు. బాలుడి మీద చెక్క టేబుల్ పడటంతో.. దెబ్బ తగలడంతో.. గాయమై తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే చిన్నారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా... అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.  పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.