70 శాతం పనులు పూర్తైయ్యాయి 6 కి.మీ. పనులు మాత్రమే ఆగిపోయాయి మెట్రో ఎండీ ఎన్విఎస్ రెడ్డి

హైదరాబాద్ మెట్రో రైల్ వచ్చే ఉగాదినాటికి పట్టాలెక్కనుంది. మెట్రో ప్రాజెక్ట్ ఆగిపోలేదని.. మరింత స్పీడ్ గా వర్క్ నడుస్తోందని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. 70 శాతం పనులు ఇప్పటికే పూర్తి అయ్యాయిని అన్నారు. సెంట్రల్ రైల్వే వారితో చర్చలు జరుపుతున్నామని.. త్వరగా పనులు పూర్తి చేస్తామన్నారు. కావాలని చాలా మంది కోర్టులలో కేసులు వేస్తున్నారని అందుకే ప్రాజెక్టు అనుకున్న సమయానికి ప్రారంభంకావడం లేదని తెలిపారు.

మొత్తం ప్రాజెక్ట్ 20 వేల కోట్లలో L&Tకి ఇప్పటికే 11వేల 500 కోట్లు చెల్లించామని తెలిపారు. మెట్రో కారిడార్ ప్రాంతాలలో రూ.15 కోట్ల ఖర్చుతో రోడ్లు మరమత్తులు చేస్తున్నామన్నారు. 2017 ఉగాది లేదా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అయిన జూన్ 2వ తేదీకి మెట్టుగూడ – నాగోలు, మియాపూర్ – SR నగర్ మధ్య రాకపోకలు ప్రారంభిస్తామని వెల్లడించారు.

మొత్తం 72 కిమీ.ల. మెట్రో ప్రాజెక్ట రహదారికి సంబంధించి పాతబస్తీలో 6 కిమీ.లు తప్ప అంతటా పనులు సాగతున్నాయిన్నారు. కాగా, హైదరాబాద్ లో కాలుష్యాన్ని తగ్గించడానికి బై సైక్లింగ్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. మెట్రో రైల్ ఎంత వరకు ఉంటే అంత వరకు బైక్ సైక్లింగ్ ఏర్పాటు చేస్తామని బైసైక్లింగ్ క్లబ్ ప్రతినిధులు తెలిపారు. నాగోల్ మెట్రో స్టేషన్ దగ్గర బై సైక్లింగ్ క్లబ్ సిద్దంగా ఉందని ప్రకటించారు.