హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి పోలింగ్ సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది.ఈ  అసెంబ్లీ నియోజకవర్గంలో 2.36 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీరంతా తమ ఓటు హక్కును వినియోగించుకొనేందుకు 302 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ఇవాళ సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ కేంద్రాల్లో ఉన్న ఓటర్లకు ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. ఈ నియోజకవర్గంలోని 2లక్షల 36 వేల 842 మంది ఓటర్లున్నారు. ఈ ఓటర్లంతా తమ ఓటుహక్కును వినియోగించుకొనేందుకు వీలుగా ఈ నియోజకవర్గంలో 302 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

ఈ నియోజకవర్గంలో ఏడు మండలాలు ఉన్నాయి.ఈ ఏడు మండలాల్లోని మూడు మండలాల్లో సమస్యాత్మక గ్రామాలు ఎక్కువగా ఉన్నాయని పోలీసులు గుర్తించారు. ఆయా గ్రామాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. గతంలో కంటే ఎక్కువ పోలిసు బలగాను ఈ గ్రామాల్లో మోహరించారు.ఈ నియోజకవర్గంలో 79 సమస్యాత్మక గ్రాామాలు ఉన్నట్టుగా ఎన్నికల అధికారులు గుర్తించారు.

967 బ్యాలెట్‌ యూనిట్లు, 363 కంట్రోల్ యూనిట్లతో పాటు 378 వీవీ ప్యాాట్లను కూడ వినియోగిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి 2009 నుండి విజయం  సాధిస్తున్నారు. ఈ దఫా ఆయన సతీమణి పద్మావతి పోటీ చేస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్ధిగా సైదిరెడ్డి బరిలో నిలిచారు. బీజేపీ అభ్యర్ధిగా కోటా రాామారావు, టీడీపీ అభ్యర్ధిగా చావా కిరణ్మయి పోటీ చేస్తున్నారు.

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి ఈ స్థానాన్ని తాము దక్కించుకోవాలని టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. తమ స్థానాన్ని తామే నిలుపుకోవాలని కాంగ్రెస్ పట్టుదలతో ఉంది. దీంతో రెండు పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి విజయం కోసం.ఇక బీజేపీ, టీడీపీలు తమ ఉనికి కోసం ఈ ఎన్నికల్లో బరిలో నిలిచాయి.