హుజూర్‌నగర్: హుజూర్‌నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో   కాంగ్రెస్ పార్టీకి హుజూర్‌నగర్ పట్టణంలోని ఒక్క పోలింగ్ స్టేషన్‌ (పీఎస్) పరిధిలో మాత్రమే  టీఆర్ఎస్ కంటే  కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి పద్మావతికి  మెజారిటీ లభించింది.

హుజూర్‌నగర్ అసెంబ్లీ ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి పద్మావతికి ఒక్క మండలంలో కూడ మెజారిటీ లభించింది. హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో ప్రతి మండలంలో టీఆర్ఎస్  అభ్యర్ధి సైదిరెడ్డికి మెజారిటీ వచ్చింది.

హుజూర్‌నగర్ పట్టణంలోని 208 పోలింగ్ స్టేషన్‌లో సైదిరెడ్డి కంటే పద్మావతికి ఎక్కువ ఓట్లు వచ్చాయి. 2009 నుండి హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్ధి  ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధిస్తున్నారు.ఈ దఫా ఆయన సతీమణి పద్మావతి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

సైదిరెడ్డి గత ఎన్నికల్లో  పోటీ చేసి ఓటమి పాలైన సానుభూతి కూడ తీవ్రంగా ప్రభావం చూపిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.హుజూర్ నగర్లో మాత్రం గత దఫా కన్నా పోలింగ్ శాతం అధికంగా నమోదవ్వడం విశేషం. 

ఈ పెరిగిన శాతం తమకంటే తమకు లాభం కలిగిస్తుందని ఇటు తెరాస, కాంగ్రెస్ లు వాదించుకొన్నారు. ఎట్టకేలకు ఈ ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి హుజూర్‌నగర్ ప్రజలు షాకిచ్చారు. ఇటు అధికార తెరాస, సిట్టింగ్ కాంగ్రెస్ ఇరు పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పోరు ఉత్కంఠంగా మారింది. 

హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానంలో టీఆర్ఎస్ భారీ విజయాన్ని సాధించనుందని ఆ పార్టీ నేతలు మొదటి నుండి చెబుతున్నారు.