Asianet News TeluguAsianet News Telugu

అటల్ బిహారీ వాజ్ పేయి విగ్రహాన్ని ఆవిష్కరించిన ఈటెల రాజేందర్ (వీడియో)

ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి 97 వ జయంతి సందర్భంగా మేడ్చల్ నియోజకవర్గం లో వారి విగ్రహాన్ని ఆవిష్కరించామని ఈటెల రాజేందర్ తెలిపారు. మహనీయుల విగ్రహాలు.. జయంతులు.. రాబోయే కాలం వారికి ఆదర్శంగా నిలుస్తాయన్నారు.

Huzurabad MLA Itala Rajender unveiled the statue of Atal Bihari Vajpayee
Author
Hyderabad, First Published Dec 25, 2021, 1:20 PM IST

మేడ్చల్ : Atal Bihari Vajpayee గారి 97 వ జయంతి సందర్భంగా మేడ్చల్ లో అటల్ బిహారీ వాజ్పేయి statueని హుజురాబాద్ ఎమ్మెల్యే etala rajender ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత జాతి కీర్తించే బిడ్డ, భారత జాతి గర్వపడే బిడ్డ అటల్ బిహారీ వాజ్పేయి అన్నారు. ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి 97 వ జయంతి సందర్భంగా మేడ్చల్ నియోజకవర్గం లో వారి విగ్రహాన్ని ఆవిష్కరించామని తెలిపారు. మహనీయుల విగ్రహాలు.. జయంతులు.. రాబోయే కాలం వారికి ఆదర్శంగా నిలుస్తాయన్నారు.

"

"చోటే మన్ సే కోయి బడ నహి హోత, టుటే మన్ సే కోయి కడ నహి హోత" నినాదం తో రాజకీయ పార్టీలు, నాయకుల గురించి ఎంతో గొప్పన చెప్పిన వ్యక్తి వాజ్ పేయి గారు.. భారత దేశ ప్రధానిగా అన్ని కుల, మత, ప్రాంతాల మెప్పు పొందిన నాయకుడు అటల్ బిహారీ వాజ్ పేయి.  ఈ దేశ చరిత్రలో అందరి చేత ప్రేమించబడ్డ ఏకైక నాయకుడు అటల్ బిహారీ వాజ్ పేయి, అలాంటి నాయకుడి విగ్రహం మేడ్చల్లో ఆవిష్కరించడం ఎంతో గర్వకారణం అని చెప్పుకొచ్చారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios