Asianet News TeluguAsianet News Telugu

Huzurabad Bypoll:నువ్వు దమ్మున్న మొగొడివే అయితే నాతో చర్చకు రా...: ఈటలకు కౌశిక్ రెడ్డి సవాల్

హుజురాబాద్ నియోజవర్గంలో టీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమని... బిజెపి నాయకుడు ఈటల రాజేందర్ కు కనీసం డిపాజిట్ కూడా దక్కదని టీఆర్ఎస్ నేత కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు. 

huzurabad bypoll... trs leader koushik reddy challenge to eatala rajender
Author
Huzurabad, First Published Sep 3, 2021, 5:00 PM IST

కరీంనగర్: తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బిజెపి నాయకులు ఈటల రాజేందర్ ఒక్కటేనని... అందువల్లే హుజూరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు కనబడడం లేదని టీఆర్ఎస్ నేత కౌశిక్ రెడ్డి అన్నారు. హుజురాబాద్ లో ఈటలనే కాంగ్రెస్ అభ్యర్థి లేకపోతే బిజెపి అభ్యర్థి అని అన్నారు. కానీ ప్రజలు ఈటల రాజేందర్ గొరి కట్టడనికి సిద్దంగా ఉన్నారని... ఆయనకు డిపాజిట్ కూడా రాదని కౌశిక్ జోస్యం చెప్పారు. 

''కాంగ్రెస్ వాళ్ళు నాకు ఇప్పటికీ టచ్ లో ఉన్నారు. వారి ద్వారానే ఈటల, రేవంత్ రహస్య సమావేశాల గురించి తెలిసింది. ఇళ్లంతకుంట టెంపుల దగ్గర హుజురాబాద్ అభివృద్దిపై చర్చిద్దాం. చర్చకు ఏర్పాట్లు నేనే చేస్తా. ఇద్దరం కలిసి చర్చిద్దాం. నువ్వు దమ్ము ధైర్యం వున్న మొగోనివే అయితే చర్చకు రా. టైం నువ్వు చెప్తావా... నేను చెప్పలా'' అంటూ ఈటలకు కౌశిక్ సవాల్ విసిరారు. 

''సహచర మంత్రులు వాళ్ళ నియోజకవర్గాల్లో వేలల్లో డబుల్ బెడ్రూం ఇల్లు కట్టి ఇప్పటికే లబ్దిదారులతో గృహ ప్రవేశాలు చేయించావు. అలా నువ్వు ఎందుకు చేయలేదు. హుజురాబాద్ నియోజకవర్గంలో ఒక్కరికయినా డబుల్ బెడ్రూం ఇళ్లు వచ్చినట్లు నిరూపిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా'' అని ఈటలకు సవాల్ చేశారు. 

''హుజురాబాద్ లో ఒక్కరింటికి కూడా మిషన్ భగీరథ నీళ్ళు రాలేదు... ఇది ఈటల రాజేందర్ అభివృద్ది. మంత్రి హరీష్ రావు చెప్పిందంతా నిజమే. ఈటల ప్రజలను ప్రలోభాలకు గురి చేసింది వాస్తవం కాదా? బొట్టు బిల్లలకు, గడియారాలకు ఓటు వేస్తారా? సంక్షేమ పథకాలు ఇచ్చే వాళ్లకు ఓటు వేస్తారు గానీ అని హరీష్ అన్నారు. అందులో తప్పేముంది'' అని కౌశిక్ పేర్కొన్నారు. 

read more  Huzurabad Bypoll: టీఆర్ఎస్ గూటికి కరీంనగర్ జిల్లా ఫిషరీస్ కార్పోరేషన్ మాజీ‌ ఛైర్మన్

''కాషాయ జెండా పట్టుకుకని ఎర్ర జెండా డైలాగులు కొడితే హుజూరాబాద్ ప్రజలెవ్వరూ నమ్మరు. నీ రాజీనామాతో హుజూరాబాద్ ప్రాంత ప్రజలు మా దరిద్రం పోయింది అనుకుంటున్నారు. కేసీఅర్, కేటిఆర్, హరీష్ రావు నాయకత్వంలో హుజూరాబాద్ లో టీఆర్ఎస్ జెండా ఎగరేస్తాం'' అన్నారు. 

''ఏ ఎలక్షన్ అఫిడవిట్ లో నీకు రూ.200 ఎకరాల భూమి ఉందని చెప్పలేదు కదా? అలాంటిది రెండు వేల కోట్ల అస్థి నీకు ఎక్కడి నుండి వచ్చాయి? ఈటల రాజకీయాల్లో రాక ముందు రెండు ఎకరాల భూమి ఉంటే ఇప్పుడు మూడు వేల ఎకరాల భూమి ఉంది. ఆయన సంపాదించిన డబ్బులు హుజూరాబాద్ ప్రాంత రైతాంగానివే. రూపాయి బొట్టు బిల్లలకు హుజూరాబాద్ ప్రజలు అమ్ముడు పోతారా?'' అని కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. 

''అయినా ముఖ్యమంత్రి కేసీఅర్ ఈటల రాజేందర్ కు ఏం తక్కువ చేసిండు. మా నాయకుడు కేసీఅర్, హరీష్ రావు గురించి ఇంకోసారి మాట్లాడితే ఈటలను బయట తిరుగనివ్వం. ఈటల స్థాయి కేసీఅర్, హరీష్ రావు ది కాదు... కేవలం వార్డు మెంబర్ స్థాయి'' అని కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios