హుజురాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న తన భర్త గెల్లు శ్రీనివాన్ యాదవ్ ను గెలిపించుకునేందుకు గెల్లు శ్వేత ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు.
కరీంనగర్: హుజురాబాద్ లో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది తెలంగాణ రాష్ట్ర సమితి. ఇప్పటికే ట్రబుల్ షూటర్ హరీష్ రావుతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు రాష్ట్రస్థాయి నాయకులు సైతం హుజురాబాద్ లో మకాం వేశారు. ఇక అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కూడా ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే ప్రచారాన్ని ప్రారంభించారు. భర్త బాటలోనే ఆయన భార్య గెల్లు శ్వేత కూడా హుజురాబాద్ కదనరంగంలోకి దిగారు. ఆమె ఇవాళ హుజురాబాద్ మండలం బొత్తలపల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
తెలంగాణ ఎస్సి కార్పోరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ తో పాటు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక మహిళలో కలిసి శ్వేత ప్రచారం నిర్వహించారు. బొంతపల్లి గ్రామంలోని ఇంటింటికి వెళ్లి అధికార టీఆర్ఎస్ కు ఓటేసి తన భర్తను గెలిపించాలని కోరారు. రోడ్డుపై వెళతున్న వారిని కూడా ఆత్మీయంగా పలకరిస్తూ టీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటేయాలో వివరించారు.
వీడియో
ఇంటింటి ప్రచారం అనంతరం గెల్లు శ్వేత మాట్లాడుతూ... మొట్టమొదటి సారిగా విద్యార్థి నాయకుడికి ఎంఎల్ఏ టికెట్ ఇచ్చిన ఘనత మన సీఎం కేసీఆర్ దే అన్నారు. ఇందుకు ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో జరగనున్న హుజురాబాద్ టిఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ కు ప్రచారంలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేసి గెల్లు శ్రీనివాస్ ని గెలిపిస్తామని అంటున్నారని గెల్లు శ్వేత పేర్కొన్నారు.
read more ఈటల సంచలన వ్యాఖ్యలు: కేసీఆర్ సీటుకు ఎసరు పెట్టే ఆలోచన హరీష్ రావుదే
మంత్రివర్గం నుండి తొలగించడంతో ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో హుజురాబాద్ నియోజకవర్గానికి ఎన్నికలు అనివార్యమయ్యాయి. బిజెపి తరపున ఈటల రాజేందర్ పోటీచేయనున్న నేపథ్యంలో ఆయనపై టీఆర్ఎస్ విద్యార్థి నాయకుడు గెల్లు శ్రీనివాస్ ను బరిలోకి నిలిపేందుకు అధికార పార్టీ సిద్దమయ్యింది. ఇలా ముందుగానే బిజెపి, టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించడంతో నోటిఫికేషన్ కు ముందే హుజురాబాద్ లో ఎన్నికల వేడి మొదలయ్యింది.
