huzurabad bypoll: నామినేషన్ దాఖలు చేసిన గెల్లు శ్రీనివాస్ యాదవ్

హుజూరాబాద్ అసెంబ్లీ స్థానం నుండి టీఆర్ఎస్ అభ్యర్ధిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్  శుక్రవారం నాడు నామినేషన్ దాఖలు చేశారు. ఇవాళ హుజూరాబాద్ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ పత్రాలన అందించారు.
 

Huzurabad bypoll: Gellu Srinivas Yadva files nomination

హుజూరాబాద్: హుజూరాబాద్ అసెంబ్లీ (huzurabad bypoll)స్థానం నుండి  టీఆర్ఎస్ అభ్యర్ధిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్(gellu srinivas yadav) శుక్రవారం నాడు నామినేషన్ (nomination)దాఖలు చేశారు.గురువారం నాడు రాత్రే సీఎం కేసీఆర్(kcr) గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు పార్టీ భీ ఫాం అందించారు. అంతేకాదు పార్టీ ఫండ్ కింద రూ. 28 లక్షల చెక్ ను ఆయనకు కేసీఆర్ ఇచ్చారు.

ఇవాళ ఉదయం కొమురవెల్లి మల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం నేరుగా హుజురాబాద్‌ చేరుకున్నారు గెల్లు శ్రీనివాస్ యాదవ్.  ఇవాళ మద్యాహ్నం హుజూరాబాద్ ఆర్డీఓ కార్యాలయంలో శ్రీనివాస్ యాదవ్ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందించారు. గెల్లు శ్రీనివాస్ వెంట ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్ బండ శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు పెద్దిరెడ్డి తదితరులు ఉన్నారు. అక్టోబర్ 30వ తేదీన  ఈ స్థానానికి పోలింగ్ జరగనుంది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా చేయడంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఈటల రాజేందర్ ఈ స్థానం నుండి ఈ దఫా బీజేపీ అభ్యర్ధిగా బరిలోకి దిగుతున్నారు.


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios